News March 16, 2025

‘పుష్ప-3’ రిలీజ్ అయ్యేది అప్పుడే: నిర్మాత

image

‘పుష్ప-3’ సినిమాను 2028లో రిలీజ్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ‘రాబిన్ హుడ్’ ప్రెస్‌మీట్‌లో ఆయన పాల్గొన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారని తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన పుష్ప, 2024లో రిలీజైన ‘పుష్ప-2’ సూపర్ హిట్‌లుగా నిలవగా, ‘పుష్ప-2’ రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 16, 2025

మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు కన్నుమూత

image

రాజవంశీకుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు అర్వింద్ సింగ్ మేవార్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ రాజస్థాన్‌లోని సిటీ ప్యాలెస్‌లో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రంజీల్లో రాజస్థాన్ కెప్టెన్‌గా వ్యవహరించారు. పూర్వీకుల ఆస్తులపై న్యాయపోరాటం చేస్తూ మేవార్ ఫ్యామిలీ ఇటీవల వార్తల్లో నిలిచింది. రేపు అర్వింద్ సింగ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.

News March 16, 2025

భోజనం చేసే విధానం ఇదే: సద్గురు

image

రోజువారీ ఆహారపు అలవాట్లపై ఆథ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ కొన్ని సూచనలు చేశారు. నేలపై కూర్చుని పద్మాసనం వేసుకుని తినాలి. చేత్తో తింటేనే మనం ఏం తింటున్నామో తెలుస్తుంది. తినేటప్పుడు 24 సార్లు నమలాలి. తినే ముందు కనీసం 2 నిమిషాలు ఆగితే ఇష్టంగా తింటాం. 35 ఏళ్లు దాటినవారు ఎంతకావాలో అంతే తీసుకోవాలి. వీరు రోజుకు రెండు సార్లు తినాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. తినేటప్పుడు మాట్లాడకూడదు.

News March 16, 2025

సమయానికి చేరుకునేలా ఉచిత బస్సులు: మంత్రి రాంప్రసాద్

image

AP: టెన్త్ విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకొని, జయప్రదంగా పరీక్షలు రాయాలన్నారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. రేపటి నుంచి 6.15లక్షల మంది టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు.

error: Content is protected !!