News December 9, 2024

పుష్ప క్రేజ్: ఆప్‌-బీజేపీ మ‌ధ్య‌ పోస్ట‌ర్‌ వార్‌

image

పుష్ప మేనియా ఢిల్లీని ఊపేస్తోంది. Febలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో రాజ‌కీయ పార్టీలు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌కు పుష్ప పోస్ట‌ర్ల‌ను వాడుకుంటున్నాయి. ఢిల్లీలో కేజ్రీవాల్‌-4, తగ్గేదే లే అంటూ ఆప్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. దీనికి కౌంట‌ర్‌గా ఆప్ అవినీతిని ఇక అంతం చేస్తామ‌ని, ర‌ప్పా ర‌ప్పా అంటూ పార్టీ స్టేట్ చీఫ్ వీరేంద్రతో కూడిన పోస్ట‌ర్‌ను BJP విడుద‌ల చేసింది.

Similar News

News November 21, 2025

NLG: వడివడిగా అడుగులు… ఏర్పాట్లపై ఈసీ కసరత్తు

image

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అడుగులు చకచకా పడుతున్నాయి. తొలుత GP ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి రాగా ఎన్నికల సంఘం ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈనెల 23న జిల్లాలో ఓటర్ల తుది జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్ల వివరాలను విడుదల చేయనున్నారు. ఇతర ఏర్పాట్లపైనా దృష్టి సారించగా.. ఈనెలాఖరుకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

News November 21, 2025

రైతుల ఆత్మహత్యాయత్నం.. మీ హామీ ఏమైంది రేవంత్: హరీశ్ రావు

image

TG: భూములు రిజిస్ట్రేషన్ కావడం లేదని MLA క్యాంపు/తహసీల్దార్ ఆఫీసుల వద్ద రైతులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘అధికారంలోకి వస్తే 3 నెలల్లో భూ సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ ఏమైంది రేవంత్? మీ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. భూములపై రైతులకు హక్కు లేకుండా చేస్తోంది. 70వేల పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు.

News November 21, 2025

తీవ్ర కాలుష్యం.. ఢిల్లీలో స్కూల్ గేమ్స్ బ్యాన్!

image

ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో స్కూళ్లలో ఓపెన్ గ్రౌండ్ క్రీడలను నిషేధించే దిశగా అక్కడి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాధారణంగా వింటర్ సీజన్‌లో ఢిల్లీలోని స్కూల్స్ స్పోర్ట్స్ మీట్స్ నిర్వహిస్తుంటాయి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గేమ్స్ రద్దు అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. కాగా ఇండోర్ గేమ్స్ నిర్వహణకూ సౌకర్యాలు కల్పించాలని పేరెంట్స్ కోరుతున్నారు.