News November 11, 2024
మరోసారి థియేటర్లలోకి ‘పుష్ప’ పార్ట్-1

‘పుష్ప’ పార్ట్-1ను USAలో ఈనెల 19న రీ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. పార్ట్-1ను ఇండియాలో కూడా రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. దీనికి సీక్వెల్గా రాబోతున్న ‘పుష్ప2-ది రూల్’ వచ్చే నెల 5న థియేటర్లలో రిలీజ్ కానుంది.
Similar News
News October 16, 2025
ఇకపై చికెన్ షాపులకు లైసెన్సులు!

AP: చికెన్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టేందుకు షాపులకు కొత్తగా లైన్సెనింగ్ విధానం తీసుకురావాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. కోడి ఏ ఫామ్ నుంచి వచ్చింది? దుకాణదారుడు ఎవరికి అమ్మారు? అనే అంశాలను ట్రాక్ చేసే వ్యవస్థను తీసుకురానుంది. గుర్తింపు పొందిన షాపుల నుంచే హోటళ్లు చికెన్ కొనేలా ప్రోత్సహించడం, స్టెరాయిడ్లు వాడిన కోళ్ల అమ్మకాలను నియంత్రించడంపై దృష్టి పెట్టనుంది.
News October 16, 2025
టీచర్లకు టెట్.. ప్రభుత్వం సమాలోచనలు!

AP: టెట్ రాసేందుకు టీచర్లకు అవకాశం కల్పించాలా? వద్దా? అనేదానిపై విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా రెండేళ్లలో టెట్ పాస్ కావాలని SEP 1న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే దీన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే అంశంపైనా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. కాగా 2011కు ముందు టెట్ లేదు.
News October 16, 2025
సృష్టిలో శివ-శక్తి స్వరూపం

శివలింగాలు ప్రధానంగా 2 రకాలు. అవి స్థావరలింగం, జంగమ లింగం. చెట్లు, లతలు స్థావర లింగాలు కాగా, క్రిమి కీటకాదులు జంగమ లింగాలు. స్థావర లింగాన్ని నీరు పోసి సంతోషపెట్టాలి. జంగమ లింగాన్ని ఆహార వస్తువులతో తృప్తిపరచాలి. ఇదే నిజమైన శివ పూజ. సర్వత్రా ఉన్న పీఠం దేవి స్వరూపం. లింగం సాక్షాత్తూ చిన్మయ స్వరూపం. ఇలా సృష్టిలోని ప్రతి అంశంలోనూ శివ-శక్తి స్వరూపాన్ని గుర్తించి, సేవించడమే ఉత్తమ పూజా విధానం. <<-se>>#SIVOHAM<<>>