News November 30, 2024

ఎల్లుండి హైదరాబాద్‌లో పుష్ప వైల్డ్ ఫైర్ జాతర

image

దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో నిర్వహించిన ‘పుష్ప వైల్డ్ ఫైర్ జాతర’ హైదరాబాద్‌లోనూ నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. డిసెంబర్ 2న హైదరాబాద్ యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు జాతర మొదలవుతుందని తెలిపింది. అభిమానులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది.

Similar News

News November 17, 2025

బెల్లం.. మహిళలకు ఓ వరం

image

నిత్యం ఇంట్లో, బయట పనులను చేస్తూ మహిళలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా కాకూడదంటే బెల్లాన్ని తమ డైట్‌లో చేర్చుకోవాల్సిందే. శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. బరువును తగ్గించడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందంటున్నారు నిపుణులు.

News November 17, 2025

శ్రీవారి సన్నిధిలో ఆంజనేయుడి ఆలయం

image

తిరుమల శ్రీవారి ఆలయం సన్నిధిలో ఎత్తైన ప్రదేశంలో ‘శ్రీ బేడీ ఆంజనేయస్వామి ఆలయం’ కనిపిస్తుంది. బాల్యంలో హనుమంతుడు తన వాహనమైన ఒంటె కోసం తిరుగుతుండేవాడు. ఆ అల్లరిని కట్టడి చేయడానికి, తల్లి అంజనాదేవి ఆయనకు బేడీలు తగిలించి, తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా కుదురుగా ఉండమని నిలబెట్టిందట. అందుకే ఈ ఆలయం బేడీ ఆంజనేయస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ స్వామి కట్టుబాటుకు ప్రతీక. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 17, 2025

సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 1,785 పోస్టులు

image

సౌత్ ఈస్ట్రన్ రైల్వే 1,785 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపి‌క చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100, SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.rrcser.co.in/