News July 3, 2024
పుష్ప2: భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్‌కు రెడీ!

హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఇక్కడ తెరకెక్కించనున్నారట. సినిమాలో ఇది క్లైమాక్స్‌లో రానుందని సమాచారం. కాగా చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
Similar News
News October 24, 2025
సిజేరియన్ తర్వాత ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ప్రస్తుతం సిజేరియన్ డెలివరీలు సాధారణమైపోయాయి. దీన్నుంచి కోలుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సిజేరియన్ తర్వాత తల్లులు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా కోలుకుంటారు. రెండు వారాల పాటు ఎక్కువ బరువున్న వస్తువులను ఎత్తకూడదు. పాలిచ్చేటపుడు ముందుకు వంగకుండా నిటారుగా కూర్చోవాలి. సంపూర్ణ పోషకాలు లభించే పదార్థాలు తీసుకుంటే సిజేరియన్ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవచ్చని సూచిస్తున్నారు.
News October 24, 2025
న్యూస్ రౌండప్

AP: కర్నూలు వద్ద ప్రమాదానికి గురైన బస్సును తొలగిస్తుండగా బోల్తా పడిన క్రేన్, ఆపరేటర్‌కు గాయాలు.. ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
● బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు: మంత్రి పార్థసారథి
● ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే మృతిపై వైసీపీ చీఫ్ జగన్ సంతాపం
TG: అంగన్వాడీ సరకుల సరఫరాలో అలసత్వం వహిస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలి: మంత్రి సీతక్క
● మూడో వన్డే కోసం సిడ్నీకి చేరుకున్న టీమ్ఇండియా
News October 24, 2025
ఇతిహాసాలు క్విజ్ – 45 సమాధానాలు

1. రావణుడు పుష్పక విమానాన్ని ‘కుబేరుడి’ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాడు.
2. కురు రాజ్యానికి మంత్రి ‘విదురుడు’.
3. ఆంజనేయుడికి గదను ఆయుధంగా ‘కుబేరుడు’ ఇచ్చాడు.
4. లక్ష్మీదేవి ‘క్షీరసాగర మథనం (పాల సముద్రం చిలికినప్పుడు) సమయంలో’ ఆవిర్భవించింది.
5. యమధర్మరాజు సోదరి ‘యమునా దేవీ’.
<<-se>>#Ithihasaluquiz<<>>


