News January 6, 2025
పుష్పకేమో నీతులు.. గేమ్ ఛేంజర్కు పాటించరా!: అంబటి

AP: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్లొస్తూ మరణించిన అభిమానులకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పరిహారం ప్రకటించడంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా విమర్శలు చేశారు. ‘పుష్పకేమో నీతులు చెప్తారా.. ‘గేమ్ ఛేంజర్’కి పాటించరా!’ అని పవన్ కళ్యాణ్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Similar News
News December 7, 2025
సికింద్రాబాద్ పేరెలా వచ్చిందంటే?

సికింద్రాబాద్ పేరు వెనుక ఓ చరిత్ర దాగి ఉంది. 1798లో 2వ నిజాం అలీఖాన్ బ్రిటిషర్లతో ‘సైన్య సహకార ఒప్పందం’ కుదుర్చుకున్నారు. దీని ప్రకారం బ్రిటిష్ సైన్యం నిజాంకు రక్షణగా ఉంటుంది. వారి కోసం కంటోన్మెంట్ ఏర్పాటు చేశారు. కాలక్రమేణా బ్రిటిష్ సైన్యం విస్తరించి, వారి ప్రభావం పెరిగింది. దానిని తగ్గించేందుకు 3వ నిజాం సికిందర్ జా 1806లో ‘ఉలుమ్’ అనే ప్రాంతాన్ని ‘సికింద్రాబాద్’గా మార్చుతూ ఫర్మానా జారీ చేశారు.
News December 7, 2025
గుత్తాధిపత్యం.. ఎప్పటికైనా ముప్పే! 1/2

ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతుండటం తెలిసిందే. విమాన సర్వీసుల్లో అగ్ర వాటా(63%) ఇండిగోది కావడంతో సమస్య తీవ్రత పెరిగింది. ఎక్కడైనా ఓ సంస్థ/కొన్ని సంస్థల <<18493058>>గుత్తాధిపత్యం<<>> ఉంటే ఆ రంగంలో మిగతా సంస్థలు నిర్వీర్యమవుతాయి. టెలికం రంగం ఇందుకో ఉదాహరణ. ఇప్పుడు 4 కంపెనీలే ఉన్నాయి. Aircel, DoCoMo, Telenor, MTNL, Reliance వంటివి విలీనమయ్యాయి లేదా దివాలా తీశాయి. విమానయాన రంగంలోనూ దాదాపు ఇదే పరిస్థితి.
News December 7, 2025
గుత్తాధిపత్యం.. ఎప్పటికైనా ముప్పే! 2/2

గుత్తాధిపత్యం(Monopoly) వల్ల ఆ రంగంలో సర్వీసులు పరిమితమవుతాయి. వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు అతి తక్కువ. తాము ఎంచుకునే ఏ ధరనైనా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయా సంస్థలకు ఉంటుంది. పోటీ పెద్దగా ఉండదు. కొత్త సంస్థలు ప్రవేశించాలన్నా చాలా కష్టం. చిన్న సంస్థలు వాటిలో విలీనం కావడమో, దివాలా తీయడమో జరుగుతుంది. బడా సంస్థల ఉత్పత్తి/సేవల్లో అంతరాయం ఏర్పడితే ఇండిగో లాంటి సంక్షోభం ఎదురవుతుంది. దీనిపై మీ కామెంట్?


