News October 16, 2025
బీర్ బాటిళ్లకూ బార్ కోడ్ పెట్టండి: చంద్రబాబు

AP: రాష్ట్రంలో ఎక్సైజ్ సురక్షా యాప్‌ను ఇప్పటివరకు 27 వేల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు అధికారులు CM చంద్రబాబుకు తెలిపారు. యాప్ స్కాన్ ద్వారా చేస్తున్న విక్రయాల్లో ఒక్క నకిలీ మద్యం బాటిల్ కూడా వెలుగు చూడలేదన్నారు. మరింత పకడ్బందీగా వ్యవస్థను తయారు చేయాలని CM ఆదేశించారు. త్వరలో బీర్ బాటిళ్లకు కూడా బార్‌కోడ్ పెట్టాలని తెలిపారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News October 16, 2025
స్కూల్ విద్యార్థులకు ఆధార్ క్యాంపులు

AP: స్కూల్ విద్యార్థులు ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. ఈ నెల 23-30వ తేదీ వరకు ప్రతి స్కూల్‌లోనూ క్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మందికి పైగా విద్యార్థులు ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది. సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కావడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
News October 16, 2025
నేడు ప్రధాని మోదీ పర్యటన.. స్కూళ్లకు సెలవులు

AP: ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేడు PM మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటించారు. మోదీ 9.55AMకు కర్నూలు చేరుకుంటారు. అక్కడ్నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఉ.9 గం.-మ.2గం. వరకు శ్రీశైలంలో వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. 2.20PMకు కర్నూలు చేరుకుని GST సభలో ప్రసంగిస్తారు.
News October 16, 2025
శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న నాలుగో ప్రధాని మోదీ

AP: ప్రధాని మోదీ ఇవాళ శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్నారు. గతంలో ఆ హోదాలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇప్పుడు నాలుగో ప్రధానిగా మోదీ వస్తున్నారు. భారత వాయుసేన విమానంలో ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు, అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్తారు. అటు మోదీకి స్వాగతం పలికేందుకు కర్నూలు నగరం ముస్తాబైంది.