News April 12, 2024
టెస్లా ప్లాంట్ ఏపీలో పెట్టండి: మస్క్‌కి లోకేశ్ విజ్ఞప్తి

AP: టెస్లా అధినేత మస్క్ భారత పర్యటనకు విచ్చేస్తున్న వేళ ఆయనకు ఆహ్వానం పలుకుతూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘మీరు భారత్ రావడం ఆనందంగా ఉంది. 2017లో మీరు చంద్రబాబు గారిని కలిసి ఆంధ్రప్రదేశ్‌పై ఆసక్తి కనబర్చారు. టెస్లా ప్లాంట్ నెలకొల్పేందుకు ఏపీ సరైన ఎంపిక. ఇక్కడ నైపుణ్యం కలిగిన యువత, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. టెస్లా విషయంలో మీ లక్ష్యాలు నెరవేరేందుకు మా రాష్ట్రం సహాయపడుతుంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 3, 2026
హార్ముజ్ మూసివేత.. సౌదీ కొత్త ప్లాన్!

హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో క్రూడాయిల్ సరఫరాకు సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఎర్ర సముద్ర తీరంలోని యంబు టెర్మినల్ నుంచి ఎగుమతి చేయాలని భావిస్తోంది. ఇందుకోసం పర్షియన్ గల్ఫ్ ఫీల్డ్స్‌లోని Abqaiq నుంచి పైపుల ద్వారా క్రూడాయిల్‌ను యంబుకు తరలిస్తారు. అక్కడి నుంచి సూయజ్ కెనాల్ మార్గంలో ఓడల ద్వారా యూరప్ వైపు, బాబ్-అల్-మందెబ్ జలసంధి ద్వారా హిందూ మహాసముద్రంవైపు తరలించవచ్చు.
News March 3, 2026
ఇరాన్ చర్చలకు సిద్ధం అంటోంది: ట్రంప్

ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ, నాయకత్వాన్ని నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తమతో చర్చలకు సిద్ధమని ఇరాన్ అంటోందని, కానీ ఇప్పటికే ఆలస్యమైందని చెప్పానని ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఈ యుద్ధం 4-5 వారాలపాటు కొనసాగవచ్చని తెలిపారు. ఆ లోపు ముగించేస్తామని, ఇజ్రాయెల్-US దళాలకు ఇది పెద్ద కష్టం కాదని చెప్పారు.
News March 3, 2026
నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: సీఎం రేవంత్

TG: నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను CM రేవంత్ ఆదేశించారు. MAR 6 నుంచి JUNE 12 వరకు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై దిశానిర్దేశం చేశారు. ‘ప్రభుత్వ పథకాలు, విద్యా వ్యవస్థలో మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ ఆస్పత్రులను సమీప మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలి. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లులు సమయానికి చెల్లించాలి’ అని సూచించారు.


