News March 26, 2024

కేజ్రీవాల్ ఫొటోను డీపీగా పెట్టుకోండి: AAP

image

తమ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో ‘ఆప్’ సోషల్ మీడియా ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ‘మోదీకి అతిపెద్ద భయం కేజ్రీవాల్’ అనే క్యాప్షన్‌తో కూడిన సీఎం ఫొటోను డీపీలుగా పెట్టుకోవాలని సూచించింది. మోదీని ఎదుర్కోగల ఏకైక నేత అరవింద్ కేజ్రీవాల్ అని, ఎన్నికల వేళ ఆధారాలు లేకున్నా అరెస్టు చేశారని మండిపడింది.

Similar News

News November 27, 2025

KNR: ‘రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి’

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాదులో మంత్రి ఉత్తం కుమార్ రెడ్డిని కరీంనగర్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. తమ సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించేందుకు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో ఫోన్లో మాట్లాడి సమస్యలపై పరిష్కారం చూపాలని తెలిపినట్లు రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

News November 27, 2025

WPL మెగా వేలంలో అమ్ముడుపోని హీలీ.. దీప్తికి రూ.3.2 కోట్లు

image

WPL మెగా వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీకి షాక్ తగిలింది. వేలంలో ఆమెను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో Unsoldగా మిగిలారు. భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తిని రూ.3.2 కోట్లకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సౌతాఫ్రికా కెప్టెన్ లారాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.10కోట్లకు దక్కించుకుంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది.

News November 27, 2025

RED ALERT: ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

image

AP: నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని APSDMA వెల్లడించింది. దీనికి ‘దిట్వా’గా పేరు పెట్టారు. దీని ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. ఆదివారం CTR, TPT, NLR, ప్రకాశం, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.