News September 23, 2024
ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ యోధుల విగ్రహాలు పెట్టండి: కూనంనేని

తెలంగాణ సాయుధ పోరాట యోధుల విగ్రహాలను HYD ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలని సీపీఐ MLA కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దొడ్డి కొమురయ్య విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై, బొమ్మగాని ధర్మభిక్షం, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, భీమరెడ్డి నర్సింహారెడ్డి, నల్లమల్ల గిరిప్రసాద్ విగ్రహాలను వారి జిల్లా కేంద్రాల్లో ప్రతిష్ఠించి గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News September 16, 2025
రానున్న 2-3 గంటల్లో వర్షం.. భారీగా ఈదురు గాలులు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురవొచ్చని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
News September 15, 2025
DANGER: నిద్ర మాత్రలు వాడుతున్నారా?

నిద్ర పట్టేందుకు కొందరు స్లీపింగ్ పిల్స్ వాడుతుంటారు. అయితే వీటి వాడకం ఎక్కువైతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, తల తిరగడం, ఆందోళన, మెదడు బద్ధకించడం, చూపు అస్పష్టంగా మారడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. వరుసగా 2 రోజులు ఈ మాత్రలు వేసుకుంటే బానిసలవుతారని, డోస్ పెంచాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News September 15, 2025
రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న

AP: రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 18వ తేదీలోపు కృష్ణపట్నం పోర్ట్ ద్వారా 11,605, కాకినాడ ద్వారా 18,765, మంగళూరు ద్వారా 2,700, జైగడ్ పోర్ట్ ద్వారా 8,100 MT యూరియా రవాణా జరుగుతుందని వెల్లడించారు. YCP కావాలనే యూరియా సరఫరాపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. రైతులను భయపెట్టి ప్రయోజనం పొందాలన్న ప్రయత్నం విజయవంతం కాదని హితవు పలికారు.