News March 18, 2024
రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతిన్

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారీ మెజార్టీతో గెలిచారు. దాదాపు 88 శాతం ఓట్లతో ఆయన మరోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో ముగ్గురు ప్రత్యర్థులు ఆయనకు నామమాత్రపు పోటీ ఇచ్చారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మరణంతో పుతిన్‌కు ఎదురు లేకుండా పోయింది. తాజా విజయంతో మరో ఆరేళ్ల పాటు పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
Similar News
News March 29, 2025
విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు

ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అన్నీ ఫ్రీఫ్రీ అంటూ ఓట్ల కోసం జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదు. జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తెలుగు రాష్ట్రాలను తెచ్చారు. పరిధికి మించి అప్పులు చేస్తే అప్పులూ పుట్టని స్థితికి వస్తారు. AP, TG నేతలు పరిస్థితులను గమనించాలి. విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు’ అని సూచించారు.
News March 29, 2025
2 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు: మంత్రి తుమ్మల

TG: రైతు భరోసా నిధులను పూర్తి స్థాయిలో అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. మరో రెండు రోజుల్లో దాదాపు 90 శాతం మంది అన్నదాతల అకౌంట్లలో డబ్బు జమ అవుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయం చేయకుండా ఉన్న భూములపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. వాటి యజమానులకు మాత్రమే డబ్బులు అందవని పేర్కొన్నారు.
News March 29, 2025
90 శాతం రాయితీ.. 2 రోజులే గడువు

TG: రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు రూ.1,010 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు పురపాలక శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి సెలవులు ఉన్నప్పటికీ పన్ను చెల్లించవచ్చని వెల్లడించింది. ఈ రెండు రోజుల్లో ఆస్తి పన్ను చెల్లించి వడ్డీపై 90 శాతం రాయితీ పొందొచ్చని పేర్కొంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.