News August 3, 2024

ఆ ఒక్కడి కోసం 16మంది ఖైదీలను వదిలేసిన పుతిన్

image

రష్యా ఆవిర్భావం తర్వాత జరిగిన అతి పెద్ద ఖైదీల మార్పిడిలో రష్యా గత నెలలో 16మంది పాశ్చాత్య ఖైదీలను వదిలేసింది. బదులుగా 8మంది రష్యన్లను విడిపించుకుంది. క్రషికోవ్ అనే ఒక్కడి కోసం రష్యా ఈ డీల్ ఒప్పుకొంది! పుతిన్‌ శత్రువుల్ని చంపడం అతడి పని. జర్మనీలో 2019లో హత్య చేసి పట్టుబడి జైలుపాలయ్యాడు. అతడిని విడిపించేందుకే పుతిన్ ఖైదీల్ని వదిలేశారు. క్రషికోవ్‌ను ఆయనే ఎయిర్‌పోర్టుకు వచ్చి రిసీవ్ చేసుకోవడం విశేషం.

Similar News

News December 3, 2025

తిరుపతిలో హోటల్ ఫుడ్‌పై మీరేమంటారు..?

image

తిరుపతికి రోజూ లక్షలాది మంది భక్తులు, ఇతర ప్రాంత ప్రజలు వస్తుంటారు. ఈక్రమంలో వందలాది హోటళ్లు తిరుపతిలో ఏర్పాటయ్యాయి. నిబంధనల మేరకు ఇక్కడ ఫుడ్ తయారు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. నిల్వ చేసిన మాసం, ఇతర పదార్థాలతో వంటలు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతూమంత్రంగానే తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వందలాది రూపాయలు తీసుకుంటున్నప్పటికీ హోటళ్లు నాణ్యమైన ఫుడ్ ఇవ్వడం లేదు. దీనిపై మీ కామెంట్.

News December 3, 2025

రేవంత్ క్షమాపణలు చెప్పాలి: కిషన్ రెడ్డి

image

TG: హిందూ దేవుళ్లను సీఎం రేవంత్ అవమానించేలా మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. CM రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి ఉందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు సీఎం రేవంత్ హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని ఆరోపించారు.

News December 3, 2025

లింగ భైరవి దేవత గురించి మీకు తెలుసా?

image

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శక్తివంతమైన దేవీ స్వరూపమే ‘లింగ భైరవి’. తాంత్రిక యోగంలో అత్యంత శక్తిమంతమైన ‘భైరవి’ రూపమే లింగాకారంలో ఉండటం వలన దీనిని లింగభైరవి అని పిలుస్తారు. కోయంబత్తూరులో ఈ ఆలయం ఉంది. భక్తులు తమ జీవితంలో భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత, ఆరోగ్యం, వ్యాపారం కోసం ఈ అమ్మవారిని పూజిస్తారు. భైరవి సాధనతో భావోద్వేగ బుద్ధిని పెరుగుతుందని నమ్మకం.