News June 17, 2024
ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్

ఉత్తరకొరియా అధినేత కిమ్ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల 18-19 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. ఒకవైపు ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం, మరోవైపు దక్షిణ కొరియా-ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ దేశానికి పుతిన్ వెళ్లడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. గత ఏడాది సెప్టెంబర్‌లో కిమ్ రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే.
Similar News
News March 15, 2026
మరణం కాదు.. నరకం నుంచి విముక్తి!

<<19352489>>హరీశ్ రాణా<<>> కేసులో ‘పాసివ్ యుథనేషియా’కు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఇది నేరుగా ప్రాణం తీసే ప్రక్రియ కాదు. కోలుకునే అవకాశం లేని రోగికి కృత్రిమంగా అందిస్తున్న వెంటిలేటర్, ఫీడింగ్ ట్యూబ్ వంటి లైఫ్ సపోర్ట్‌ను నిలిపేస్తారు. దీనివల్ల బాధితుడు తన అనారోగ్యం కారణంగా సహజంగా మరణిస్తారు. వాళ్లు పడే నరకయాతనను ముగించి గౌరవప్రదమైన మరణాన్ని అందించడమే ఈ వైద్య ప్రక్రియ ఉద్దేశం.
News March 15, 2026
ఏం సందేశం ఇస్తున్నారు?

డ్రగ్స్ కేసులో TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబడటం రాజకీయ నాయకులపై ప్రజలకు అసహ్యం కలిగించేలా చేస్తోంది. వీకెండ్ వచ్చిందంటే చాలామంది నేతలు ‘ఎంజాయ్’ చేసేందుకే ఎగిరిపోతున్నారు. తీరా చూస్తే ఇలా ఫామ్‌హౌస్‌లు, పబ్‌లు, క్లబ్బుల్లో ‘గబ్బు’ పనులు చేస్తున్నారు. యువతకు లెక్చర్లు ఇచ్చే ఇలాంటి నేతలు మందు, విందు, డ్రగ్స్ తీసుకుంటూ వారికి ఏం సందేశం ఇస్తున్నారు?
News March 15, 2026
హెల్ప్ చేస్తాం.. కానీ, మాకు డబ్బులు కావాలి: జెలెన్‌స్కీ

ఇరాన్‌తో తాము యుద్ధం చేయడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు <<19386678>>జెలెన్‌స్కీ<<>> అన్నారు. షాహెద్ డ్రోన్ల నుంచి పశ్చిమాసియా దేశాలను కాపాడేందుకు రక్షణ కవచంలా మారుతున్నామని తెలిపారు. రష్యా ప్రయోగిస్తున్న డ్రోన్లను కూల్చడంలో ఆరితేరిన ఉక్రెయిన్ ఇప్పుడు ఆ అనుభవాన్ని గల్ఫ్ దేశాలకు పంచుతోంది. దీనికి ప్రతిఫలంగా తమకు టెక్నాలజీ, నిధులు కావాలని జెలెన్‌స్కీ కోరారు. ఇప్పటికే ఖతర్, UAE, సౌదీకి ఎక్స్‌పర్ట్స్‌ను పంపారు.


