News February 9, 2025

మరణాల్ని పుతిన్‌ ఆపాలనుకుంటున్నారు: ట్రంప్

image

ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ కాల్ మాట్లాడానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘మా ఇద్దరి మధ్య ఎన్నిసార్లు ఫోన్ కాల్ సంభాషణ జరిగిందనేది ప్రస్తుతానికి రహస్యం. కానీ అమాయకుల ప్రాణాలు పోకుండా ఆపాలని పుతిన్ కూడా కోరుకుంటున్నారు. యుద్ధాన్ని ఆపేందుకు మంచి ప్రణాళిక ఉంది. వచ్చేవారం ఉక్రెయిన్‌లో పర్యటించి ఆ దేశాధ్యక్షుడితో భేటీ అవుతా’ అని స్పష్టం చేశారు.

Similar News

News January 31, 2026

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మోదీ పేరు.. తీవ్రంగా ఖండించిన భారత్

image

అమెరికా ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో PM మోదీ పేరు ఉండటాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. 2017లో ఇజ్రాయెల్ పర్యటనకు మోదీ వెళ్లారన్న విషయం తప్ప మిగతావన్నీ అబద్ధాలేనని కొట్టిపారేసింది. దోషిగా తేలిన నేరస్థుడి చెత్త పుకార్లని MEA ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మండిపడ్డారు. మోదీ తన సలహా తీసుకున్నారని ఎప్‌స్టీన్ చెప్పినట్లు ఆ డాక్యుమెంట్లలో ఉంది. పలు వివాదాస్పద అంశాలనూ ఈమెయిల్‌లో పేర్కొన్నారు.

News January 31, 2026

మున్సిపల్ ఎన్నికలు.. CM షెడ్యూల్ ఫిక్స్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 6 ఉమ్మడి జిల్లాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 4న ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ, 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న నిజామాబాద్ రూరల్, 7న రంగారెడ్డి జిల్లా పరిగి, 8న ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి, 9న మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు.

News January 31, 2026

ఫ్యూచర్ ట్రేడింగ్.. వెండి రేటు రూ.1.28 లక్షలు డౌన్

image

కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా పతనమవుతున్నాయి. <<19006060>>ఫ్యూచర్ ట్రేడింగ్<<>>(మార్చి)లో కేజీ వెండి ధర ఏకంగా రూ.1,28,126 పడిపోయి రూ.2,91,922 పలికింది. అలాగే ఏప్రిల్‌కు సంబంధించి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,50,849కి పడిపోయింది. లైఫ్ టైమ్ హై(రూ.1,80,779)తో పోల్చితే రూ.29,930 తగ్గడం గమనార్హం.