News March 18, 2024

మూడో ప్రపంచయుద్ధంపై పుతిన్ హెచ్చరిక

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ మూడో ప్రపంచ యుద్ధం ప్రస్తావన తీసుకురావడం ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రష్యాకు, అమెరికా నేతృత్వంలోని నాటోకు యుద్ధమంటే మూడో ప్రపంచ యుద్ధానికి అడుగుదూరంలోనే ఉన్నట్లని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితిని ఎవరూ కోరుకోరని అన్నారు. ‘ఉక్రెయిన్‌కు నాటో సైన్యం చేరుకున్నట్లు గుర్తించాం. వారికి ఇది మంచిది కాదు. భారీ సంఖ్యలో కన్నుమూస్తారు’ అని హెచ్చరించారు.

Similar News

News October 6, 2024

రేపు వారి అకౌంట్లలో డబ్బులు జమ

image

AP: సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద బాధితులకు ప్రభుత్వం రేపు డబ్బులు అందించనుంది. మొత్తం 21,768 మంది ఖాతాల్లో రూ.18.69 కోట్లను జమచేయనున్నట్లు అధికారులు తెలిపారు. అందరికీ సాయం అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం గత నెలలో రూ.602 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. బ్యాంకు ఖాతాల్లో తప్పులు, ఆధార్ లింక్ కాకపోవడం వల్ల కొందరికి డబ్బులు జమకాలేదు.

News October 6, 2024

ఘోరం.. 1.7లక్షల మందికి ఒక్క టాయిలెట్!

image

బెంగళూరు అభివృద్ధిలో దూసుకెళ్తోంది. కానీ, అక్కడున్న 1.4 కోట్ల మంది ప్రజలకు కనీస మౌలిక సదుపాయమైన టాయిలెట్లను ఏర్పాటు చేయలేకపోయింది. నగరంలో 803 పబ్లిక్ టాయిలెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు RV యూనివర్సిటీ నివేదికలో వెల్లడైంది. ఈ లెక్కన ప్రతి 1.7లక్షల మందికి ఓ టాయిలెట్ ఉందన్న మాట. వీటిలోనూ సగం వాటిల్లో లైట్స్ లేవని తేలింది. కాగా HYDలోనూ టాయిలెట్స్ పెంచాలని నెటిజన్లు కోరుతున్నారు.

News October 6, 2024

కాంగ్రెస్ మోసాలపై నిలదీయండి.. యువతకు హరీశ్‌రావు పిలుపు

image

TG: గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి ఆ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేసిన యువత ఓసారి ఆలోచించాలని హరీశ్‌రావు కోరారు. ‘పింఛన్ పెంచలేదు. పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసాకు దిక్కులేదు. బోనస్‌ను బోగస్ చేశారు. ఉద్యోగాల ఊసులేదు. రూ.4వేల భృతికి నీళ్లు వదిలారు. ఈ దసరాకు సొంతూళ్లకు వస్తున్న వారితో INC మోసాలపై చర్చించండి. ఆ పార్టీ నాయకులను నిలదీయండి’ అని Xలో పిలుపునిచ్చారు.