News March 23, 2024
పుట్ బాల్ అసోసియేషన్‌కు సిగ్గుండాలి: హీరో నిఖిల్

ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపై హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు. ‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మనం ఇలాంటి ఫలితాలు సాధించడం ఏంటీ? ఇందుకు భారత ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గుపడాలి. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చండి’ అని ఆయన కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, IFCకి ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Similar News
News November 1, 2025
ఢిల్లీలో వాయు కాలుష్యంతో 17,188 మరణాలు

ఢిల్లీలో సంభవించిన మరణాల్లో ఏడింటిలో ఒక మరణానికి వాయుకాలుష్యమే కారణంగా ఉంది. 2023లో వాయుకాలుష్యం వల్ల 17,188(15%) మంది మరణించినట్లు ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవాల్యూయేషన్(IHME) నివేదిక తెలిపింది. అదే ఏడాది హైబీపీతో 12.5%, మధుమేహంతో 9శాతం, అధిక కొలెస్ట్రాల్‌తో 6%, ఊబకాయంతో 5.6శాతం మరణాలు చోటు చేసుకున్నాయి. 2018-24 మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ ఉంది.
News November 1, 2025
కాశీబుగ్గ ఘటన.. మృతులు వీరే

AP: 1.ఏడూరి చిన్నమ్మి(50)-రామేశ్వరం(టెక్కలి), 2.రాపాక విజయ(48)-పిట్టలసరి(టెక్కలి), 3.మురిపింటి నీలమ్మ(60)-దుక్కవానిపేట-పల్లిఊరు(వజ్రపుకొత్తూరు), 4.దువ్వు రాజేశ్వరి(60)-బెలుపతియా(మందస), 5.చిన్ని యశోదమ్మ(56)-శివరాంపురం(నందిగం), 6.రూప-గుడ్డిభద్ర(మందస), 7.లోట్ల నిఖిల్(13)-బెంకిలి(సోంపేట), 8.డొక్కర అమ్ముదమ్మ-పలాస, 9.బోర బృందావతి(62)- మందస. మరో వ్యక్తి ఆస్పత్రిలో మృతిచెందగా వివరాలు తెలియాల్సి ఉంది.
News November 1, 2025
చంద్రబాబువి పిట్టలదొర మాటలు: జగన్

AP: తుఫాను నిర్వహణపై CM చంద్రబాబువి పిట్టలదొర మాటలని YCP చీఫ్ జగన్ ఎద్దేవా చేశారు. ‘వైపరీత్యాల వేళ రైతులకు శ్రీరామరక్షగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేయడం బెటర్ మేనేజ్‌మెంట్ అవుతుందా? మొంథా తుఫాను వల్ల నష్టపోయిన బీమాలేని రైతులకు దిక్కెవరు? మీ 18నెలల కాలంలో 16సార్లు వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోతే రూ.600CR ఇన్ పుట్ సబ్సిడీ బకాయి పెట్టారు. ఒక్కపైసా పంట నష్ట పరిహారం ఇవ్వలేదు’ అని ఆరోపించారు.


