News October 16, 2024
కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారు: సజ్జల

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ‘వైసీపీ నేతలను కేసుల్లో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ఘటనలో ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. కేసు ముగిసే సమయానికి నోటీసులు ఏంటి? నటి జెత్వానీ కేసులోనూ ఇలాగే నన్ను ఇరికించారు. స్కిల్ కేసులో CBNకు ఈడీ క్లీన్ చిట్ ఎలా ఇస్తుంది? ఇంతకన్నా బరితెగింపు ఉంటుందా?’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News December 15, 2025
మెస్సీ టూర్ గందరగోళం.. కలకత్తా హైకోర్టులో PIL

ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ టూర్ సందర్భంగా కోల్కతా స్టేడియంలో ఏర్పడిన గందరగోళంపై హైకోర్టులో PILలు దాఖలయ్యాయి. వీటిని స్వీకరించిన కోర్టు వచ్చేవారం విచారిస్తామని పేర్కొంది. LOP సువేందు అధికారి తదితరులు వీటిని దాఖలు చేశారు. నిష్పాక్షిక దర్యాప్తుకోసం CBI, ED, SFIOతో విచారించాలని కోరారు. కాగా మిస్మేనేజ్మెంటు, స్టేడియంలో విధ్వంసం ఘటనలపై CM మమత రాష్ట్ర ప్రభుత్వ కమిటీతో విచారణకు ఆదేశించడం తెలిసిందే.
News December 15, 2025
యూరియా బుకింగ్ కోసం యాప్: తుమ్మల

TG: యాసంగికి సరిపడా యూరియా అందుబాటులో ఉంచుతామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు బారులు తీరాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునేందుకు త్వరలో మొబైల్ యాప్ విడుదల చేస్తామన్నారు. కాగా ఇప్పటికే 2.48 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రంలో అందుబాటులో ఉండగా.. డిసెంబర్కు కేటాయించిన యూరియా కూడా చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
News December 15, 2025
ఇంధన ధరల్లో తేడాకు అవే కారణం: కేంద్రం

ఢిల్లీ, ముంబైతో పోలిస్తే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి సురేశ్ గోపీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.74, అండమాన్&నికోబార్లో రూ.82.46గా ఉంది. రవాణా ఖర్చులు, ఆయా రాష్ట్ర/UT ప్రభుత్వాలు విధించే VAT (వాల్యూ యాడెడ్ ట్యాక్స్)లో తేడాలే ఇందుకు కారణం’ అని తెలిపారు. ఏపీలో లీటర్ పెట్రోల్ పై VAT రూ.21.90, అండమాన్లో రూ.0.82గా ఉంది.


