News December 23, 2024

పీవీ తెలంగాణలో పుట్టడం మనకు గర్వకారణం: KTR

image

TG: తెలంగాణ ఏర్పాటు తర్వాత పీవీ నరసింహారావును BRS ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని కేటీఆర్ అన్నారు. ‘గడ్డు కాలంలో ప్రధానిగా సేవలందించి ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడారు. ఆయన తెలంగాణలో పుట్టడం మనందరికీ గర్వకారణం. పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాం. భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి తీర్మానం పంపాం. ఆయన కూతురికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం’ అని పీవీ వర్ధంతి సందర్భంగా ట్వీట్ చేశారు.

Similar News

News November 24, 2025

AP TET.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

image

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2.59 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇన్ సర్వీస్ టీచర్లు 32,000 మంది దరఖాస్తు చేశారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. డిసెంబర్ 10 నుంచి ఆన్‌లైన్‌లో రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.

News November 24, 2025

తిరుమల కొండపై ‘బంగారు బావి’ వైభవం

image

శ్రీవారి దర్శనం తర్వాత కనిపించేదే ‘బంగారు బావి’. దీనికి బంగారు రేకుల తాపడం ఉంటుంది. అందుకే ఈ పేరొచ్చింది. ఇందులో నుంచి వచ్చే జలాన్ని స్వామి కైంకర్యాలకు ఉపయోగిస్తారు. ఈ బావి అడుగున వైకుంఠంలో ప్రవహించే విరజానది ప్రవహిస్తుందని నమ్ముతారు. పూర్వజన్మలో తొండమాన్ చక్రవర్తిగా ఉన్న రంగదాసు ఈ పవిత్ర బావిని నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ జలం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 24, 2025

అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోండిలా

image

బ్యాంకు ఖాతాల్లోని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను RBI ఉద్గం <>పోర్టల్‌లో<<>> లాగిన్ అయి తెలుసుకోవచ్చు. ఖాతాదారుడు లేదా వారి కుటుంబ సభ్యుల పేరు, PAN, DOB వంటి వివరాలు ఎంటర్ చేయాలి. ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే వారి వారసులు డెత్ సర్టిఫికెట్, లీగల్ హెయిర్, KYC డాక్యుమెంట్లతో బ్యాంకును సంప్రదించాలి. DEC 31లోగా క్లెయిమ్ చేసుకోని నగదును డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్(DEAF) ఖాతాకు బదిలీ చేస్తారు.