News June 28, 2024
పీవీ సేవలు మరువలేనివి: సీఎం రేవంత్

TG: సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుకు దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పి.వి చిత్రపటానికి పూలమాల వేసి CM నివాళులు అర్పించారు. ఉమ్మడి ఏపీ సీఎంగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని రేవంత్ పేర్కొన్నారు.
Similar News
News January 3, 2026
కాల్స్, మెసేజ్లు వేరేవాళ్లకు వెళ్తున్నాయా? ఇలా చెక్ చేసి ఆపేయండి!

‘అన్కండిషనల్ కాల్ ఫార్వర్డింగ్’ ద్వారా హ్యాకర్లు మీ కాల్స్, SMS, OTPలను వారి నంబర్కు మళ్లించే ప్రమాదం ఉంది. మొబైల్లో *#21# డయల్ చేస్తే మీ స్క్రీన్పై ఒక లిస్ట్ కనిపిస్తుంది. అందులో వాయిస్, డేటా, SMS వంటి వాటి పక్కన Not Forwarded అని ఉంటే మీ ఫోన్ సేఫ్. ఒకవేళ ఏదైనా నంబర్ కనిపిస్తే మీ సమాచారం లీక్ అవుతున్నట్టే. ఫార్వర్డ్ అవుతున్నాయని గుర్తిస్తే ##002# డయల్ చేసి అన్ని సెట్టింగ్లను రద్దు చేయొచ్చు.
News January 3, 2026
BSFలో 549 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

<
News January 3, 2026
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి

TG: ఇది పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ‘మరో మూడేళ్లు ప్రతి ఏప్రిల్లో విడతల వారీగా అర్హులకు ఇళ్లు ఇస్తాం. గత ప్రభుత్వం పింక్ కలర్ షర్ట్ ఉంటేనే ఇళ్లు ఇచ్చింది. ఆగిపోయిన ఇళ్లకూ నిధులు కేటాయించాం. గత ప్రభుత్వం కమీషన్ల కోణంలోనే పంపిణీ చేసింది. మొదటి విడతలోనే చెంచులకు ఇళ్లిచ్చాం’ అని తెలిపారు.


