News July 8, 2024
ఒలింపిక్స్‌లో భారత పతాకధారిగా పీవీ సింధు

పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్తున్న భారత బృందానికి చెఫ్ దే మిషన్(మొత్తం టీమ్‌కు ఇన్ఛార్జ్)గా షూటర్ గగన్ నారంగ్‌ను IOA నియమించింది. ఈయన దేశానికి నాలుగు ఒలింపిక్స్ పతకాలు తీసుకొచ్చారు. చెఫ్ దే మిషన్ బాధ్యతల నుంచి బాక్సర్ మేరీ కోమ్ తప్పుకోవడంతో నారంగ్‌కు అవకాశం వచ్చింది. అలాగే ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత్ తరఫున పతాకధారులుగా షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ వ్యవహరించనున్నారు.
Similar News
News October 15, 2025
‘తెలంగాణ విజన్’… మీ ఆలోచన ఏంటి?

తెలంగాణ రైజింగ్ విజన్-2047 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఓ డాక్యుమెంట్‌ను రూపొందిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాష్ట్రాన్ని టాప్‌లో నిలబెట్టేలా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. వ్యవసాయం, ఆరోగ్యం, నూతన ఆవిష్కరణలు, స్థానిక సంస్థల బలోపేతం సహా పలు అంశాలపై ప్రతి పౌరుడు తప్పనిసరిగా OCT 25 లోగా ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. మీ ఆలోచన పంచుకోవడానికి <
News October 15, 2025
ఎల్లుండి అకౌంట్లోకి డబ్బులు

TG: సింగరేణి కార్మికులకు అక్టోబర్ 17న దీపావళి బోనస్ అందనుంది. పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు(PLR)గా పిలిచే ఈ బోనస్ కింద ఈ ఏడాది రూ.1.03 లక్షల చొప్పున చెల్లించేలా బొగ్గు సంస్థల <<17842581>>యాజమాన్యాలు <<>>అంగీకరించాయి. కోల్ ఇండియా కింద ఉన్న అన్ని సంస్థలూ బోనస్ చెల్లించనుండగా, సింగరేణి మినహా మిగతా వారికి దసరా సమయంలోనే అందించారు. ఎల్లుండి సింగరేణి కార్మికుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.
News October 15, 2025
వంటింటి చిట్కాలు

* టమాటా, పండు మిరపకాయ పచ్చళ్లు ఎర్రగా ఉండాలంటే తాలింపులో వంటసోడా కలిపితే సరిపోతుంది.
* కూరల్లో గ్రేవీ పలచగా అయినప్పుడు కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* ఇడ్లీ పిండి పలుచగా అయినప్పుడు దానిలో చెంచా బ్రెడ్ పొడి, పావు చెంచా మొక్కజొన్న పిండిని నీళ్లలో కలిపి చేర్చితే పిండి గట్టిగా అవడంతో పాటు ఇడ్లీలు మృదువుగా వస్తాయి.