News December 3, 2024
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మెన్ వెంకటదత్త సాయితో ఆమె ఏడడుగులు నడవనున్నారు. ఈ నెల 22న వీరి వివాహం ఉదయ్‌పుర్‌లో గ్రాండ్‌గా జరగనుంది. అనంతరం 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తారు. కాగా వరుడు సాయి కుటుంబానికి, సింధు ఫ్యామిలీకి ఎప్పటినుంచో అనుబంధం ఉంది. త్వరలో వీరి వివాహ పనులు ప్రారంభమవుతాయి.
Similar News
News December 2, 2025
‘కోహ్లీ’ దిగ్గజాలను దాటేశారు: ఫ్యాన్స్

SAపై తాజా సెంచరీతో వన్డేల్లో కోహ్లీ 52 సెంచరీలు చేసి ఓ ఫార్మాట్లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్‌గా నిలిచారు. అయితే సెంచరీల్లో దిగ్గజ ప్లేయర్లను విరాట్ ఎప్పుడో దాటేశారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కోహ్లీ వన్డేల్లో 294 ఇన్నింగ్స్ ఆడారని, ఇదే సంఖ్యలో ఆడిన తర్వాత సచిన్ సెంచరీలు 33 అని, పాంటింగ్ 26, గేల్ 25 శతకాలు బాదారని పోస్టులు పెడుతున్నారు. బ్యాటింగ్ AVG కూడా కోహ్లీ(58)దే ఎక్కువ అని చెబుతున్నారు.
News December 2, 2025
ఫోన్లలో Govt యాప్.. నిఘా కోసమేనా?

ఫోన్లలో ప్రభుత్వ ‘సంచార్ సాథీ’ యాప్ <<18439451>>డిఫాల్ట్‌గా<<>> ఉండాలన్న కేంద్రం నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నేరాలకు అడ్డుకట్ట వేసే పేరుతో ప్రజలపై నిఘా పెట్టాలనుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రష్యా, నార్త్ కొరియా వంటి దేశాల్లోనే డిలీట్ చేసేందుకు వీలులేని ఇలాంటి యాప్స్ ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నార్త్ కొరియాలా తమపై నిఘా పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్?
News December 2, 2025
విష్ణు నామాల్లోనే ఆయన గొప్పతనం

అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః|
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థివిరో ధ్రువః||
కొలవలేనంత గొప్పతనం కలిగిన అప్రమేయుడు, మనస్సుకు అధిపతి అయిన హృషీకేశుడు, దేవతలకు రాజైన సురప్రభువు, సృష్టిని నిర్మించిన విశ్వకర్మ, మన పాలకుడైన మనువు, రూపాలను తీర్చిదిద్దే త్వష్టా, అతి స్థిరమైన స్థవిష్ఠుడు, ధ్రువుడు, అతి పెద్దవాడైన స్థవిరుడు, నాభి నుంచి పద్మం కలిగిన పద్మనాభుడు ఆ విష్ణుమూర్తే. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


