News November 21, 2024

చైనా మాస్టర్స్‌లో పీవీ సింధు ఓటమి

image

భారత షట్లర్లు పీవీ సింధు, అనుపమ ఉపాధ్యాయ చైనా మాస్టర్స్ టోర్నీలో రెండో రౌండ్లో వెనుదిరిగారు. సింగపూర్‌కు చెందిన యెవో జియా మిన్ చేతిలో సింధు 16-21, 21-17, 21-23 తేడాతో ఓడిపోగా అనుపమ జపాన్ క్రీడాకారిణి నత్సుకీ నిడైరాతో 21-7, 21-14 తేడాతో ఓటమిపాలయ్యారు. సింధు ఈ ఏడాది వరుసగా 7 టోర్నమెంట్లలో క్వార్టర్ ఫైనల్ కూడా దాటకపోవడం గమనార్హం.

Similar News

News February 4, 2026

పీరియడ్స్‌లో రొమ్ము నొప్పి సహజమేనా?

image

కొంతమంది మహిళలకు పీరియడ్స్‌కి ముందు రొమ్ములు సున్నితంగా ఉండటం, నొప్పి, రొమ్ముల సైజు పెరగడం వంటివి జరుగుతాయి. పీరియడ్స్‌లో రొమ్ముల్లో వచ్చే ఈ మార్పులను ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ ఛేంజెస్ అంటారు. పీరియడ్స్‌లో ఈస్ట్రోజన్‌ స్థాయిలు పెరగడంతో ఇలా జరుగుతుందంటున్నారు. పీరియడ్స్‌లో ఇది సాధారణమే కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ అసాధారణ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News February 4, 2026

కల్కి పార్ట్-2లో 90 నిమిషాల పాటు కమల్!

image

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న కల్కి పార్ట్-2పై భారీ అంచనాలున్నాయి. FEB చివరి వారం నుంచి ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే పార్ట్-1లో తక్కువ నిడివి ఉన్న కమల్ హాసన్ పాత్ర పార్ట్-2లో 90 నిమిషాల పాటు ఉంటుందట. అలాగే 2 వెరైటీ లుక్స్‌లో కనిపించనున్నారని సినీ వర్గాల టాక్. దీనికి తోడు ఈ మూవీలో సాయి పల్లవి కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

News February 4, 2026

రైతులకు గుడ్‌న్యూస్.. విపత్తుల టైమ్‌లో డాక్యుమెంట్స్ లేకుండా లోన్?

image

వరదల వంటి విపత్తుల టైంలో రైతుల నుంచి బ్యాంకులు బలవంతంగా లోన్లు వసూలు చేయొద్దని RBI సూచించింది. కొత్త డ్రాఫ్ట్ ప్రకారం.. ‘బాధిత రైతులకు EMIల రీ-షెడ్యూలింగ్, మారటోరియం, డాక్యుమెంట్స్ లేకుండా టాపప్ లోన్ల వంటి సదుపాయాలు కల్పించాలి. ఎక్స్‌ట్రా ఛార్జీలు ఏడాది వరకు రద్దు చేయాలి. విపత్తుకు ముందు 30 రోజుల కంటే ఎక్కువ డిఫాల్ట్ అయి ఉండొద్దు’ పేర్కొంది. వీటికి ఆమోదం లభిస్తే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.