News December 25, 2024

భర్తతో లవ్ స్టోరీ బయటపెట్టిన PV సింధు

image

ఈ నెల 22న సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్‌లో పెళ్లి చేసుకున్న బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ తన లవ్ స్టోరీని బయటపెట్టారు. వెంకట దత్త సాయితో తొలి చూపులోనే ప్రేమలో పడ్డట్లు తెలిపారు. 2022 అక్టోబర్‌లో తొలి సారి సాయిని విమానంలో కలిసినట్లు పేర్కొన్నారు. ఆ ప్రయాణమే తమను మరింత క్లోజ్ చేసిందన్నారు. నిశ్చితార్థం కూడా అతికొద్ది సన్నిహితుల సమక్షంలోనే జరిగినట్లు వెల్లడించారు.

Similar News

News December 26, 2024

వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టలేం: సీఎం

image

TG: తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టలేమన్నారు. తనకు ప్రత్యేకంగా ఎలాంటి రాగద్వేషాలు లేవని చెప్పారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రభుత్వం సహకరిస్తుందని, అదే సమయంలో ప్రభుత్వానికి సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు. చిత్ర పరిశ్రమ రాజకీయాలను దూరం పెట్టాలని సూచించారు.

News December 26, 2024

బాక్సింగ్ డే టెస్టు: తొలి రోజు ముగిసిన ఆట

image

బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి AUS 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఆసీస్ టాపార్డర్‌లో నలుగురు బ్యాటర్లు అర్ధసెంచరీలు చేశారు. స్మిత్(68*), కమిన్స్(8*) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 3, ఆకాశ్ దీప్, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు. తొలి రోజే 87,242 మంది అభిమానులు హాజరయ్యారని, ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధికమని క్రీడా వర్గాలు తెలిపాయి.

News December 26, 2024

వైకుంఠద్వార దర్శనం.. 9 చోట్ల టికెట్ల జారీ!

image

మార్చి-2025 నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయగా క్షణాల్లో బుక్ అయిపోయాయి. వీటితో పాటు వైకుంఠద్వార దర్శనం కోసం సర్వదర్శనం టోకెన్ల విడుదలపై ప్రకటన చేసింది. 2025 జనవరి 10-12 వరకు 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్‌లు అందజేస్తామని తెలిపింది. వీటిని జనవరి 8న ఉదయం 5 గంటలకు తిరుపతిలోని 9 ప్రదేశాల్లో అందజేస్తారు. కాగా, ఈ పది రోజుల్లో టోకెన్లు లేకుండా దర్శనానికి అనుమతించరు.