News June 5, 2024
ఇండోనేషియా ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి
ఇండోనేషియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో భారత ప్లేయర్ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే ఓడారు. చైనీస్ తైపీ ప్లేయర్ సు వెన్‌చి చేతిలో 15-21, 21-15, 14-21తేడాతో పరాజయం పాలయ్యారు. పారిస్ ఒలింపిక్స్ 2024కి ముందు సింధు వరుస ఓటములపై భారత అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన మలేషియా మాస్టర్స్‌లో సింధు రన్నరప్‌గా నిలిచారు.
Similar News
News January 10, 2025
బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహరాజ్’ సినిమా నుంచి మరో ట్రైలర్ రాబోతోంది. రిలీజ్ ట్రైలర్‌ను ఇవాళ సా.5:53 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇది మొదటి ట్రైలర్‌ను మించేలా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా, తమన్ సంగీతం అందించారు. ఈనెల 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
News January 10, 2025
బస్సు టికెట్ రూ.6వేలు, ఫ్లైట్ టికెట్ రూ.15వేలు
సంక్రాంతి పండక్కి వెళ్లే వారిని ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు దోచుకుంటున్నారు. ఇదే అదనుగా బస్సు టికెట్ ధరలను భారీగా పెంచేశారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ.4వేలు, విశాఖకు రూ.6వేలు వసూలు చేస్తున్నారు. అటు HYD నుంచి విశాఖ ఫ్లైట్ టికెట్ ధర రూ.15వేలుగా ఉంది. డబుల్, ట్రిపుల్ రేట్లను వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
News January 10, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన వరుణ్ ఆరోన్
టీమ్ ఇండియా పేసర్ వరుణ్ ఆరోన్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. 2011లో అరంగేట్రం చేసిన అతడు భారత్ తరఫున 9 టెస్టులు, 9 వన్డేలు ఆడారు. మొత్తం 29 వికెట్లు తీశారు. 2010-11 రంజీ ట్రోఫీలో 152 km/h వేగంతో బంతి విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత వరుస గాయాలతో అతడి కెరీర్ ప్రమాదంలో పడింది.