News March 13, 2025
Q-కామర్స్‌లో 5.5 లక్షలమందికి కొలువులు!

భారత్‌లో క్విక్ కామర్స్ రంగం వచ్చే ఏడాది లోపు 5.5 లక్షల కొత్త కొలువుల్ని సృష్టించొచ్చని టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా వేసింది. ‘క్యూ కామర్స్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది చివరికి 5 బిలియన్ డాలర్ల వ్యవస్థగా మారనుంది. వ్యాపార సంస్థలు తమ ఉద్యోగుల నైపుణ్యాల్ని మరింత మెరుగుపరచాలి’ అని ఓ నివేదికలో పేర్కొంది. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటివి క్విక్ కామర్స్ సంస్థల కిందకు వస్తాయి.
Similar News
News March 13, 2025
నటి ఇళ్లలో ED దాడులు: బంగారం సీజ్!

కర్ణాటక గోల్డ్ స్మగ్లింగ్ కేసులో భాగంగా బెంగళూరులోని 8 లొకేషన్లలో ED దాడులు చేపట్టింది. కోరమంగల సహా నటి రన్యారావుకు చెందిన 2 ఇళ్లు, కేసులో సహ నిందితుడు తరుణ్ ఇంట్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. అధికారులు భారీ స్థాయిలో బంగారం సీజ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎయిర్‌పోర్టులో తన కుమార్తెకు సాయం చేయాలని ఆమె తండ్రి, DGP రామచంద్రారావు కానిస్టేబుల్ బసవరాజును ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి.
News March 13, 2025
మా వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇచ్చింది: సీఎం

AP: ఉమ్మడి ఏపీలో విపక్షాలు తనను ప్రపంచ బ్యాంక్ జీతగాడు అని విమర్శించాయని, కానీ ప్రజల కోసం భరించానని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘నేను 1995లో తొలిసారి సీఎం అయినప్పుడు రోజుకు 10-15 గంటలే కరెంటు ఉండేది. దేశంలో తొలిసారిగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చాం. 2003లో కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా ఏపీని మార్చాం. మేము తెచ్చిన సంస్కరణల వల్లే కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇవ్వగలిగింది’ అని అసెంబ్లీలో సీఎం చెప్పారు.
News March 13, 2025
తెలియని వ్యక్తులపై రంగు చల్లితే కఠిన చర్యలు: CP

హోలీ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని CP సీవీ ఆనంద్ పేర్కొన్నారు. రోడ్డుపై వెళ్తోన్న తెలియని వ్యక్తులపై రంగులు చల్లితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్లిక్ రోడ్స్, ప్లేసెస్‌లో రంగులు చల్లుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దన్నారు. బైక్స్, ఇతర వాహనాలతో గుంపులుగా తిరగడం నిషేధమని తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉండనుంది.