News August 26, 2024

Q1 GDP వృద్ధి 7-7.1 శాతం: SBI

image

2024-25 మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7-7.1% వృద్ధి చెందుతుందని SBI రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. వాస్తవ వృద్ధి రేటు అంచనాల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది. ప్రపంచ సరకు రవాణా, కంటైనర్ ఖర్చుల పెరుగుదల, సెమీకండక్టర్ల కొరత వంటి సప్లై చైన్ ఒత్తిళ్ల ఉన్నా ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని SBI రీసెర్చ్ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు.

Similar News

News November 23, 2025

వివిధ పండ్ల తోటలు – పిందె రాలడానికి కారణాలు

image

☛ మామిడి -పుష్పాలలో పరాగ సంపర్క లోపం, పుష్ప దశలో వర్షం, హార్మోన్ల అసమతుల్యత, రసం పీల్చే పురుగుల దాడి
☛ నిమ్మ, బత్తాయి – అధిక వర్షాలు, అధిక ఎరువుల వాడకం, పాము పొడ పురుగు
☛ ద్రాక్ష – అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావం, అధిక తేమ, బూడిద, ఆంత్రాక్నోస్ తెగులు
☛ బొప్పాయి – పరాగసంపర్కం లోపం, బోరాన్ లోపం, అధిక వర్షం లేదా నీరు నిల్వ ఉండిపోవడం, బూడిద తెగులు పుష్పాలపై రావడం వల్ల పిందెలు రాలిపోతాయి.

News November 23, 2025

ఆన్‌లైన్‌లో సర్వపిండి, సకినాలు!

image

TG: సర్వపిండి, సకినాలు, కజ్జికాయలు, గవ్వలు వంటి పిండివంటలకు బ్రాండింగ్ కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్(D)లోని మహిళా సంఘాలకు వీటి తయారీ, ఆకర్షణీయ ప్యాకింగ్, నాణ్యతా ప్రమాణాలపై శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం వీరు FSSAI ధ్రువీకరణతో విక్రయాలు చేస్తున్నారు. ఈ పిండివంటల అమ్మకాలు పెంచేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

News November 23, 2025

టెక్ దిగ్గజాలందర్నీ ఒక చోటకు చేర్చిన AI

image

టెక్ బిలియనీర్ల ఫొటోలతో క్రియేట్ చేసిన ‘వన్ ట్రిలియన్ స్క్వాడ్’ AI పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శామ్ ఆల్ట్‌మన్, జెన్సెన్ హువాంగ్‌ను ఏఐ సహాయంతో పార్టీలో ఉన్నట్టుగా క్రియేట్ చేశారు. సమాంతర విశ్వంలో ఒక చోట, సరదాగా కలుసుకున్న, వన్ ట్రిలియన్ స్క్వాడ్ సమావేశం అంటూ ఫొటోలకు క్యాప్షన్స్ ఇచ్చారు.