News February 16, 2025

రేపు భారత్‌కు ఖతర్ అమీర్

image

ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్-థనీ రేపు, ఎల్లుండి భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధాని ఆహ్వానం మేరకు అమీర్ భారత్‌కు వస్తున్నారని.. రాష్ట్రపతి, PM మోదీతో ఆయన భేటీ అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధంపై ఈ పర్యటనలో చర్చలు జరుగుతాయని పేర్కొంది. 2015 మార్చిలో ఆయన తొలిసారి భారత్‌లో పర్యటించగా ఇది రెండో పర్యటన అని వెల్లడించింది.

Similar News

News January 10, 2026

రైతులకు రూ.2,000.. ఫిబ్రవరిలోనే!

image

PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000లను 3 విడతలుగా కేంద్రం జమ చేస్తోంది. ఇప్పటివరకు 21 విడతలు పూర్తయ్యాయి. తాజా సమాచారం ప్రకారం 22వ విడత నిధులు ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి E-కేవైసీ, ఆధార్, బ్యాంక్ వివరాలు తప్పనిసరి చేశారు. లోపాలు ఉంటే బెనిఫిషరీ లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉండటంతో రైతులు వివరాలను సరిచూసుకోవాలి.

News January 10, 2026

ఈ పథకం కింద ఏ పరికరాలను అందిస్తారు?

image

వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించి, యాంత్రీకరణను ప్రోత్సహించి అధిక దిగుబడులను సాధించడమే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ముఖ్య ఉద్దేశం. అందుకే రైతులు సాగులో ఎక్కువగా వినియోగించే ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, పవర్ టిల్లర్లు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలు, రోటావేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లను ప్రభుత్వం రాయితీగా అందించనుంది. దీని వల్ల పంట నాట్లు, కోత సమయంలో కూలీల కొరత, ఖర్చు తగ్గి రైతులకు ఎంతో లబ్ధి కలగనుంది.

News January 10, 2026

చైల్డ్ పోర్న్ బ్రౌజింగ్.. 24 మంది అరెస్ట్

image

TGలో చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్నవారిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో <<18800907>>అరెస్ట్<<>> చేసి కౌన్సెలింగ్ ఇస్తోంది. సైబర్ టిప్ లైన్ ద్వారా అందిన ఫిర్యాదులతో HYDలో 15, WGLలో ముగ్గురు, NZBలో ఇద్దరు సహా మొత్తం 25మందిని అరెస్ట్ చేసింది. నిందితుల్లో ఇరిగేషన్ శాఖలో జూ.అసిస్టెంట్‌గా పనిచేసే వ్యక్తి కూడా ఉన్నాడు. చైల్డ్ పోర్న్ చూసేవారిని ఆన్‌లైన్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్&అబ్యూస్ మెటీరియల్ గుర్తిస్తోంది.