News January 30, 2025
ఫిర్యాదులకు ఆలయాల్లో QR కోడ్

AP: రాష్ట్రంలోని ఆలయాల్లో తమకు ఎదురైన ఇబ్బందులపై ఫిర్యాదు చేయడంతోపాటు సలహాలు ఇచ్చేందుకు క్యూఆర్ కోడ్ను దేవదాయ శాఖ అందుబాటులోకి తేనుంది. తొలుత సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో వీటిని ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. దర్శన అనుభవం, ఇతర మౌలిక సదుపాయాలు, సిబ్బంది ప్రవర్తనపై భక్తులు ఫిర్యాదు చేయొచ్చు.
Similar News
News January 17, 2026
50 ఏళ్ల క్రింద మేడారం జాతర.. ఫొటోలు

TG: దాదాపు 5 దశాబ్దాల క్రితం మేడారం జాతర ఎలా ఉండేదో తెలిపే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు సమ్మక్క ఆగమనం, జంపన్న వాగు వద్ద భక్తులు స్నానాలు చేస్తున్న ఫొటోలు ఉన్నాయి. మొక్కులు సమర్పిస్తున్న భక్తుల జనసందోహం అద్భుతంగా ఉంది. 1970 నాటి ఈ అరుదైన చిత్రాలను ఓ మ్యాగజైన్లో ప్రచురించారు.
News January 17, 2026
OFFICIAL: NDA ఘన విజయం

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. 227 వార్డుల్లో బీజేపీ 89 స్థానాలు, శివసేన (శిండే వర్గం) 29 సీట్లతో మొత్తంగా 118 సీట్లు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు శివసేన (UBT) 65, MNS 6 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ కూటమి 24, AIMIM 8, NCP 3, సమాజ్వాదీ పార్టీ 2 , NCP (SP) ఒక్క సీటు మాత్రమే గెలిచింది.
News January 17, 2026
ఇరాన్ పరిస్థితిపై కీలక ఫోన్ కాల్

ఇరాన్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్లో చర్చించారు. మిడిల్ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్లో నెలకొన్న అస్థిరతపై ఇరువురు ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే ఇరాన్తో మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమని పుతిన్ తెలిపినట్లు సమాచారం. శాంతి పునరుద్ధరణకు దౌత్య ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


