News February 8, 2025
టెన్త్ ప్రశ్నపత్రాలపై QR కోడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738972730277_695-normal-WIFI.webp)
TG: టెన్త్ క్వశ్చన్ పేపర్లపై క్యూఆర్ కోడ్, సీరియల్ నంబర్లను విద్యాశాఖ ముద్రించనుందని సమాచారం. ఎక్కడైనా లీకైతే అవి ఏ సెంటర్ నుంచి బయటికి వచ్చాయో సులభంగా తెలుసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. APలో గత ఏడాదే ఈ విధానం అమలు చేశారు. కాగా ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల కాగానే విద్యార్థుల మొబైల్‌కు మెసేజ్ పంపేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే హాల్‌టికెట్ రానుంది.
Similar News
News February 8, 2025
ఆప్‌కు బిగ్ షాక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738985516205_653-normal-WIFI.webp)
అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆప్‌కు ఫలితాల్లో ఎదురుగాలి వీస్తోంది. BJP 42 చోట్ల లీడింగ్‌లో ఉండగా ఆ పార్టీ కేవలం 25 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకంటే ముఖ్యంగా ఆప్ అగ్రనేతలు వెనుకంజలో ఉండటం పార్టీ శ్రేణులను షాక్‌కు గురి చేస్తోంది. కేజ్రీవాల్, ఆతిశీ, మనీశ్ సిసోడియా, ఇమ్రాన్ హుస్సేన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వెనుకంజలోనే కొనసాగుతున్నారు.
News February 8, 2025
బీజేపీ వివాదాస్పద అభ్యర్థి ముందంజ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738985103181_782-normal-WIFI.webp)
బీజేపీ వివాదాస్పద అభ్యర్థి రమేశ్ బిధూరి కల్కాజీ అసెంబ్లీ స్థానంలో సీఎం ఆతిశీపై లీడింగ్‌లో ఉన్నారు. తాను గెలిస్తే ఢిల్లీ రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తానని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దేశ వ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రస్తుతం 40+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
News February 8, 2025
ఆధిక్యంలో మేజిక్ ఫిగర్ దాటిన బీజేపీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738984849415_653-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. లీడింగ్‌లో ఆ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటింది. మొత్తం 70 స్థానాలుండగా 36 చోట్ల గెలిస్తే అధికారం దక్కుతుంది. ప్రస్తుతం బీజేపీ 38 స్థానాల్లో లీడింగ్‌లో దూసుకెళ్తోంది. ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో అలాగే పట్టు నిలుపుకుంటే కాషాయ పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆప్ 25 చోట్ల ముందంజలో కొనసాగుతోంది.