News October 4, 2025

నేషనల్ హైవేలకు క్యూఆర్ కోడ్‌లు

image

వాహనదారులకు ఉపయోగపడే సమాచారాన్ని తెలిపేందుకు నేషనల్ హైవేల పొడవునా క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు NHAI తెలిపింది. రోడ్ ప్రాజెక్టు వివరాలు, అత్యవసర నంబర్లు, NHAI ఆఫీస్‌లు, ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, పంక్చర్ రిపేర్ షాపులు, టోల్‌ప్లాజా దూరం, వాహన సర్వీస్, ఛార్జింగ్ స్టేషన్లు తదితర వివరాలను ఇవి తెలియజేస్తాయి. ఇందుకు సంబంధించిన సైన్ బోర్డులను పలు చోట్ల ఏర్పాటు చేస్తారు.

Similar News

News October 4, 2025

ఈ-క్రాప్ ఎలా నమోదు చేస్తారు? ఎందుకు ముఖ్యం?

image

AP: ఈ-క్రాప్ నమోదులో భాగంగా వ్యవసాయ సిబ్బంది.. రైతు ఆధార్, ఫోన్ నంబర్, సర్వే నంబర్‌తో పాటు పొలం వద్ద రైతుల ఫొటోలు తీసి ఈ-పంట యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. పొలం గట్ల మీద సాగు చేసే పంటలు, చెట్లను కూడా ఈ క్రాపింగ్ చేస్తారు. పంట నమోదు చేశాక e-KYC చేస్తారు. ఇది పూర్తైన వారికే పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వర్తిస్తుంది. అలాగే ఈ-క్రాప్‌లో నమోదైన రైతుల నుంచే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుంది.

News October 4, 2025

ఈ-క్రాప్ నమోదుకు ఈ నెల 25 తుది గడువు

image

APలో ఖరీఫ్ పంటలకు ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను ఈ నెల 25లోగా పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు, సిబ్బందికి.. ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు సూచించారు. నమోదులో భాగంగా సవరణలు, సామాజిక తనిఖీ, ఇతర మార్పులను ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని, 31న తుది జాబితా విడుదల చేయాలని అధికారులను ఢిల్లీరావు ఆదేశించారు. ఈ క్రాప్ నమోదుకు SEP-30ని చివరి తేదీగా ప్రభుత్వం గతంలో ప్రకటించగా.. తాజాగా ఆ గడువును పెంచింది.

News October 4, 2025

ఆయన కన్నెర్ర చేస్తే కష్టాలే!

image

జ్యోతిష శాస్త్రం ప్రకారం.. శని దేవుడు కర్మలకు అధిపతి. మన జీవితంలోని ప్రతి క్రియకు తగిన కర్మ ఫలితాలను ఆయనే నిర్ణయిస్తారు. వాటిని సక్రమంగా అమలు చేస్తారు. అందుకే శని భగవాన్‌కి అంతటి ప్రాధాన్యం ఉంటుంది. ఆయన అనుగ్రహం ఉంటేనే మనం సుఖశాంతులతో ఉంటామని పండితులు చెబుతున్నారు. ఆయన కన్నెర్ర చేస్తే మాత్రం కర్మలకనుగుణంగా కష్టాలు పడాల్సిందేనని అంటున్నారు. ఆయన కరుణ కోసం ధర్మంగా ఉండటం, సత్కర్మలు చేయడం ముఖ్యం.