News January 20, 2025

పని నాణ్యతే ముఖ్యం: భారత్ పే సీఈఓ

image

వారంలో 90 గంటలు పనిచేయడమనేది చాలా కష్టమని భారత్ పే CEO నలిన్ నెగీ తెలిపారు. వర్క్ అవర్స్ కంటే ఎంత నాణ్యతతో పని చేశామనేదే ముఖ్యమన్నారు. ఉద్యోగి ఒత్తిడితో కాకుండా సంతోషంగా పనిచేస్తేనే సంస్థకు లాభమని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎల్ అండ్ టీ ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ కామెంట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

Similar News

News January 19, 2026

నేడు దావోస్‌కు CM రేవంత్

image

TG: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనేందుకు నేడు సీఎం రేవంత్ దావోస్ వెళ్లనున్నారు. మేడారంలో మహాజాతరను ప్రారంభించాక ఉ.8 గం.కు హెలికాప్టర్‌లో HYD చేరుకుంటారు. ఉ.9.30గం.కు శంషాబాద్ నుంచి CM, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు పర్యటనకు వెళ్లనున్నారు. గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలివర్, లోరియల్, టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి సంస్థల అధినేతలతో రేవంత్ భేటీ అవుతారు.

News January 19, 2026

శివపార్వతుల నిత్య నివాసం, మోక్ష క్షేత్రం ‘వారణాసి’

image

పురాణాల ప్రకారం.. పార్వతీదేవి కోరిక మేరకు శివుడు కైలాసం వదిలి గంగాతీరంలోని కాశీని తన స్థిర నివాసంగా చేసుకున్నాడు. అందుకే కాశీ శివపార్వతుల గృహంగా, మోక్ష నగరంగా విరాజిల్లుతోంది. ఇక్కడి విశ్వనాథ జ్యోతిర్లింగ దర్శనం పాపాలను తొలగిస్తుందని నమ్మకం. జీవన్మరణాల సంగమమైన ఈ క్షేత్రంలో మరణించిన వారికి శివుడు స్వయంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే భారతీయ సంస్కృతిలో కాశీకి అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.

News January 19, 2026

సంక్రాంతి ముగిసింది.. రొటీన్ లైఫ్ మొదలైంది

image

సంక్రాంతి సెలవులు ముగిశాయి. ఇష్టం లేకపోయినా, మనసుకు కష్టమైనా సరే పల్లెలు విడిచి తిరిగి పట్టణాలకు చేరుకున్నారు. మళ్లీ అదే ఉరుకులు పరుగుల జీవితంలోకి అడుగు పెట్టేశారు. బాస్ మెప్పు కోసం తిప్పలు, కెరీర్ వెనుక పరుగులు, నైట్ షిఫ్టులతో కుస్తీలు పడాల్సిందే. ఈ ఏడాది సొంతూరులో గడిపిన క్షణాలు, అమ్మానాన్న ఆప్యాయతలు, అయినవాళ్ల పలకరింపులను మనసులో దాచుకుని మళ్లీ వచ్చే సంక్రాంతి వరకు వాటినే నెమరువేసుకోవాలి!