News September 12, 2025
2026 నాటికి క్వాంటమ్ వ్యాలీ పూర్తి: చంద్రబాబు

AP: తెలుగుజాతి అన్నింట్లో నం.1గా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని Way2News Conclaveలో CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘2026 నాటికి అమరావతి క్వాంటమ్ వ్యాలీ పూర్తవుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అందిస్తామని చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రపంచానికి మనం క్వాంటమ్ కంప్యూటర్స్ సరఫరా చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో అన్నీ సాధ్యమే. మనమూ ప్రపంచానికి పెద్ద పెద్ద ఉత్పత్తులను సరఫరా చేసే పరిస్థితి వస్తుంది’ అని తెలిపారు.
Similar News
News March 4, 2026
ఇండియా కంటే ఇంగ్లండ్ స్పిన్ మెరుగ్గా ఉంది: మైఖేల్ వాన్

T20 WC: భారత్‌తో జరగనున్న సెమీఫైనల్లో ఇంగ్లండ్‌దే పైచేయి అని ఆ దేశ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ జోస్యం చెప్పారు. ఇంగ్లండ్ వద్దే మెరుగైన స్పిన్ అటాక్ ఉందని అభిప్రాయపడ్డారు. ఆదిల్ రషీద్, లియామ్ డాసన్, విల్ జాక్స్ ఈ టోర్నీలో బెస్ట్ ఇచ్చారని కొనియాడారు. టీమ్‌ఇండియా X-ఫ్యాక్టర్ వరుణ్ చక్రవర్తిని ప్రత్యర్థి బ్యాటర్లు ఈజీగా ఎదుర్కొంటున్నారని, ఫీల్డింగ్‌లోనూ భారత్ వెనకబడి ఉందని విమర్శించారు.
News March 4, 2026
ఆనాటి ‘రంగుల’ లోకాన్ని మిస్ అవుతున్నారా?

పురోహితుల సూచనతో చాలా ప్రాంతాల్లో హోలీ పండుగను ఇవాళే జరుపుకుంటున్నారు. అయితే చాలాచోట్ల ఒకప్పటి సందడి కనిపించట్లేదు. ముఖ్యంగా పట్టణాల్లో పిల్లలు, పెద్దలూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అదే ఒకప్పుడు ఫ్రెండ్స్‌తో ఊరంతా తిరిగి ఎంజాయ్ చేసేవాళ్లు. ఒళ్లంతా రంగులు పూసుకున్నా మనసు నిండా స్వచ్ఛమైన ఆనందం ఉండేది. ఏ టెన్షన్ లేకుండా నవ్వుతూ గడిపిన ఆ రోజులు మళ్లీ రావు. మీరూ ఒకప్పటి హోలీని మిస్ అవుతున్నారా? COMMENT
News March 4, 2026
ఇరాన్ యుద్ధానికి ₹18.8 లక్షల కోట్లు..

ఇరాన్‌పై దాడుల్లో తొలి 24 గంటల్లోనే US దాదాపు ₹6,900 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ యుద్ధం నెల రోజులు సాగితే మొత్తం ఖర్చు ₹18.87 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. భారీ విమానవాహక నౌక ‘USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్’ నిర్వహణకే రోజుకు ₹58 కోట్లు ఖర్చవుతోందని సమాచారం. చమురు ధరలు పెరగడం, ట్రేడ్ డిస్టర్బెన్సెస్ వల్ల USకు అదనంగా మరో $115 బిలియన్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.


