News August 11, 2024

మళ్లీ రేషన్ కోసం క్యూ: YCP

image

AP: రేషన్ సరుకుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ట్వీట్ చేసింది. ‘జగన్ తీసుకొచ్చిన ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డీలర్ నుంచి బియ్యం, సరుకులు తెచ్చుకోవాలంటే క్యూలో ఇక కుస్తీ చేయాల్సిందే. వృద్ధులు, దివ్యాంగులకు మళ్లీ నరకం చూపెట్టేందుకు సిద్ధమవుతున్నావా చంద్రబాబు?’ అని ప్రశ్నించింది.

Similar News

News January 12, 2026

ఇతిహాసాలు క్విజ్ – 125 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: భీముడికి వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చింది?
జవాబు: దుర్యోధనుడు విషమిచ్చి నదిలో పడేయగా, భీముడు నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ నాగరాజు వాసుకి భీముడిని తన మనువడిగా గుర్తించి, దివ్య రసాన్ని ప్రసాదించాడు. ఆ అమృత రసం తాగడం వల్లే భీముడికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. ఆ బలంతోనే ఆయన ఎందరో బలవంతులను, కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 12, 2026

చిరు-బాలయ్య కాంబో సాధ్యమేనా?

image

మన శంకరవరప్రసాద్ గారు మూవీలో సీనియర్ స్టార్లు చిరంజీవి, వెంకటేశ్ చేసిన సందడికి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి, బాలకృష్ణ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. బాలయ్యతో కలిసి ఫ్యాక్షన్ మూవీ చేయాలనుందని గతంలో చిరంజీవి చెప్పారు. రామ్ చరణ్, జూ.NTRతో రాజమౌళి తీసిన RRR ప్రపంచవేదికపై సత్తా చాటింది. ఇప్పుడు చిరు-బాలయ్య సినిమా వస్తే పండగేనని ఫ్యాన్స్ అంటున్నారు. మీరేమంటారు?

News January 12, 2026

మెస్సీ ఓ మాట చెప్పాడంతే.. ₹లక్ష కోట్లు పెరిగిన సంపద!

image

సెలబ్రిటీలు చేసే చిన్న పనులు కూడా కొన్ని కంపెనీలపై భారీ ప్రభావం చూపిస్తాయి. ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ క్యాజువల్‌గా చెప్పిన మాట కోకా-కోలాకు సిరులు కురిపించింది. ‘నాకు వైన్ అంటే ఇష్టం. స్ర్పైట్ కలుపుకుని తాగుతా’ అని ఆయన చెప్పారు. దీంతో ఆ కంపెనీ షేర్లు భారీగా ఎగిశాయి. 3రోజుల్లో 12.9బిలియన్ డాలర్ల(₹1.16లక్షల కోట్లు) సంపద పెరిగింది. 2021లో రొనాల్డో కోకా-కోలా ప్రొడక్టును పక్కనపెట్టడంతో $4Bను కోల్పోయింది.