News December 16, 2024
‘గ్రూప్-2’ పరీక్షలో తెలంగాణ తల్లిపై ప్రశ్న!

ఇవాళ జరిగిన ‘గ్రూప్-2’ పరీక్షలో ‘ఈక్రింది వాటిలో తెలంగాణ తల్లికి సంబంధించి ఏది సరికాదు?’ అని ప్రశ్నించారు. దీనికి 4 ఆప్షన్స్ ఇచ్చారు. వాటిలో A. తెలంగాణ తల్లి విగ్రహ కిరీటము, వడ్డాణంలో కోహినూరు& జాకబ్ వ్రజముల ప్రతిరూపములను కూర్చారు. B. ఈమె పాదాల మెట్టెలు కరీంనగర్ ఫిలిగ్రీ వెండితో తయారుచేశారు. C. ఈమె గద్వాల్, పోచంపల్లి చీరలు పోలిన చీరలో ఉంది. D. ఈమె ఓ చేతిలో బోనం పట్టుకుంది. సరైన సమాధానమేంటి?
Similar News
News January 23, 2026
అర్ష్‌దీప్ బౌలింగ్.. 2 ఓవర్లలోనే 36 రన్స్

భారత్‌తో రెండో టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్లు అర్ష్‌దీప్ వేసిన రెండు ఓవర్లలో 36 రన్స్ బాదారు. తొలి ఓవర్లో కాన్వే 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 18 పరుగులు, 3 ఓవర్లో సీఫెర్ట్ చివరి 4 బంతుల్లో 4 ఫోర్లు బాదారు. 4వ ఓవర్‌ను హర్షిత్ మెయిడెన్ వేసి కాన్వే వికెట్ తీశారు. ఐదో ఓవర్లో వరుణ్ చక్రవర్తి 2 పరుగులిచ్చి సీఫెర్ట్‌ను ఔట్ చేశారు. అయితే హర్షిత్ వేసిన 6వ ఓవర్లో 19 పరుగులొచ్చాయి. 6 ఓవర్లకు NZ స్కోర్ 64/2.
News January 23, 2026
విచారణలో రాధాకిషన్ ఎంట్రీ..? KTR రిప్లై ఇదే!

TG: ఫోన్ ట్యాపింగ్‌పై తనను విచారించే సమయంలో మాజీ DCP రాధాకిషన్ రావును పిలిపించారనేది అవాస్తవమని KTR స్పష్టం చేశారు. ‘అక్కడ తారకరామారావు తప్ప మరే రావు లేడు. ప్రభుత్వం కుట్రతో ఇచ్చే ఇలాంటి లీకులను మీడియా వెరిఫై చేయకుండా ప్రజలకు చెప్పవద్దు’ అని కోరారు. కాగా SIT ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తూ అంతా అధికారులే చూసుకున్నారని KTR చెప్పడంతో రాధాకిషన్‌ను రప్పించి ఎదురెదురుగా విచారించారని ప్రచారం జరిగింది.
News January 23, 2026
‘హంద్రీనీవా’కు 40TMCల నీరు…CMకు థాంక్స్

AP: హంద్రీనీవా విస్తరణకు కృషిచేసి రాయలసీమకు నీళ్లందించారని CM CBNకు
మంత్రులు కేశవ్, జనార్దన్, MLA కాల్వ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. 190 రోజుల్లో 40 TMCల నీటిని విడుదల చేసి రికార్డు సృష్టించినట్లు చెప్పారు. 2014-19 మధ్య 6 పంపులుండగా ఇపుడు 100 రోజుల్లో 12 పంపుల సామర్థ్యానికి పెంచడంతో ఇది సాధ్యమైందన్నారు. కాగా మార్చి నాటికి 50 TMCలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మలకు CM సూచించారు.


