News March 7, 2025
క్వశ్చన్ పేపర్ లీక్.. ఎగ్జామ్ రద్దు

AP: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ <<15680685>>పరీక్షా పత్రం లీకేజీ<<>> అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విచారణ చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News April 2, 2026
ఒళ్లంతా సిందూరం.. ఇదే హనుమ కథ

హనుమంతుడు ఒళ్లంతా సిందూరం పూసుకొని ఉండటం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. సీతమ్మ తన నుదుటన సిందూరం ధరించడం వెనుకున్న విశేషాన్ని హనుమ అడిగారట. శ్రీరాముడి ఆయురారోగ్యాల కోసమని ఆమె చెప్పడంతో.. తన ప్రభువుకి మరింత మేలు జరుగుతుందని ఆంజనేయుడు దానిని తన శరీరం అంతటా పూసుకుంటాడు. ఆయన అమాయకత్వంతో కూడిన భక్తికి ముగ్ధుడైన రాముడు.. సిందూరంతో హనుమను పూజించే భక్తులకు అన్ని కష్టాలు తొలగుతాయని వరం ఇచ్చారు.
News April 2, 2026
హనుమాన్: భక్తుడే కాదు.. గొప్ప రక్షకుడు కూడా!

హనుమంతుడు శ్రీరాముడి పరమ భక్తుడే కాదు. ఆపదల్లో ఆదుకునే రక్షకుడు కూడా. అందుకు కురుక్షేత్రంలోని ఈ ఘటనే నిదర్శనం. యుద్ధంలో అర్జునుడి రథంపై హనుమాన్ ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం ముగిశాక అర్జునుడు రథం దిగిన వెంటనే అది బూడిదైంది. శత్రువులు వేసిన అస్త్రాల శక్తిని కృష్ణుడితో పాటు హనుమంతుడు కూడా తన దివ్యశక్తితో ఆపి, అర్జునుడిని కాపాడాడు. అందుకే హనుమంతుడిని ఆపద్బాంధవుడు అంటారు.
News April 2, 2026
హనుమంతుడికి 5 ముఖాలు ఎలా వచ్చాయి?

రామరావణ యుద్ధంలో మైరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళంలో బంధిస్తాడు. అతడిని అంతం చేయాలంటే 5 దీపాలు ఒకేసారి ఆర్పాలి. అందుకే హనుమాన్ పంచముఖ రూపం ధరించి, ఆ దీపాలను ఆర్పి మైరావణుడిని వధించాడు. దుష్టశిక్షణ కోసం ఉద్భవించిన ఈ మహోగ్ర రూపం భక్తులకు సర్వ శుభాలను చేకూరుస్తుందని నమ్మకం. పంచముఖ హనుమత్ స్తోత్రం జపించి, ఆయనను పూజిస్తే దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.


