News November 8, 2024
ఏ వయసులో స్మోకింగ్ మానేసినా ప్రయోజనాలుంటాయ్
దశాబ్దాల పాటు స్మోకింగ్ చేసి లేటు వయసులో మానేయడం వల్ల ఉపయోగం లేదనే కొందరి వాదన తప్పు అని నిపుణులు చెబుతున్నారు. ఎంత పొగతాగేవారైనా, ఏ వయసులోనైనా దాన్ని వదిలేస్తే ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చంటున్నారు. ‘1-2ఏళ్లు మానేస్తే గుండె వ్యాధులు, 5-10ఏళ్ల తర్వాత క్యాన్సర్ ముప్పు సగానికి తగ్గుతుంది. రోగనిరోధక వ్యవస్థ, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి’ అని పేర్కొంటున్నారు.
Similar News
News November 8, 2024
8శాతం పెరిగిన ట్రంప్ మీడియా షేర్లు
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందడంతో ఆయన మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ షేర్లు 8శాతం వృద్ధిని నమోదు చేశాయి. దీంతో ట్రంప్ ఆస్తి విలువ 300 మిలియన్ డాలర్ల (రూ. 2500 కోట్లకు పైమాటే) మేర పెరిగింది. దీంతో సంస్థలో ట్రంప్ వాటా విలువ మొత్తం 4.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఇంత పెరిగినప్పటికీ మూడో త్రైమాసికంలో 19.2 మిలియన్ డాలర్ల నష్టాన్ని ట్రంప్ మీడియా నమోదు చేయడం గమనార్హం.
News November 8, 2024
తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్
భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, ఆయన సతీమణి అతియా శెట్టి త్వరలో పేరెంట్స్ కాబోతున్నారు. 2025లో తాము బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఈ స్టార్ కపుల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2023 జనవరిలో వీరికి వివాహమైంది. అతియా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అనే విషయం తెలిసిందే.
News November 8, 2024
వైసీపీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు
AP అసెంబ్లీ సమావేశాలకు వెళ్లబోమన్న YCP నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 11 సీట్లే గెలవడాన్ని అవమానంగా భావించి దూరంగా ఉండడం సరికాదని ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు. ప్రజలు ఏ పదవిలో కూర్చోబెట్టినా దానికి న్యాయం చేయాలంటున్నారు. అయితే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడంతో ఇక సభలో ఎదురయ్యే అవమానాల దృష్ట్యా ఆత్మగౌరవం దెబ్బతినొద్దనే ఇలా చేస్తున్నట్లు YCP శ్రేణులు చెబుతున్నాయి. మీరేమంటారు?