News April 19, 2024
R.K బీచ్లో గుర్తు తెలియని మృతదేహం

విశాఖ ఆర్.కె బీచ్ నోవాటెల్ ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మహారాణిపేట పోలీసులు శుక్రవారం గుర్తించారు. మృతుడు సర్ఫ్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్ పాంట్ వేసుకున్నాడని, వయసు 55 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు మహారాణిపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. మహారాణిపేట సీఐ, ఎస్.ఐ నెంబర్లు 94407 96010, 94407 96052కు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News October 27, 2025
ఏసీబీ వలలో జీవీఎంసీ ఆర్ఐ, సచివాలయ సెక్రటరీ

విశాఖలో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్గా చిక్కారు. తగరపువలస దగ్గర సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీ సోమ నాయుడు, జీవీఎంసీ ఆర్ఐ రాజును సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచానికి సంబంధించిన కేసు విషయంలో ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 27, 2025
రుషికొండ బీచ్లో పరిస్థితులు పరిశీలించిన డీఐజీ

మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రుషికొండ బీచ్ ప్రాంతాన్ని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, అడిషనల్ ఎస్పీ మధుసూదన్ పరిశీలించారు. బీచ్ తీర ప్రాంతంలో గాలులు బలంగా వీయడంతో భద్రతా ఏర్పాట్లు సమీక్షించారు. పర్యాటకులు, మత్స్యకారులను సముద్ర తీరాలకు వెళ్లవద్దని సూచించారు. పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
News October 27, 2025
విశాఖ: మొంథా తుఫాను.. అప్రమత్తమైన వైద్య సిబ్బంది

మొంథా తుఫానుపై వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందిని DMHO జగదీశ్వరరావు అప్రమత్తం చేశారు. 54 హెల్త్ వెల్నెస్, 66 పట్టణ, 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మంచినీటి వనరులను బ్లీచింగ్ చేయాలని, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఏడు 104, పదహారు 108, ఇరవై మూడు 102 తల్లి బిడ్డ వాహనాలను తుఫాను ప్రాంతాల్లో ఫిషెర్మెన్ డిపార్ట్మెంట్తో కలిసి బోట్ క్లీనిక్స్గా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.


