News April 19, 2024

R.K బీచ్‌లో గుర్తు తెలియని మృతదేహం

image

విశాఖ ఆర్.కె బీచ్ నోవాటెల్ ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మహారాణిపేట పోలీసులు శుక్రవారం గుర్తించారు. మృతుడు సర్ఫ్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్ పాంట్ వేసుకున్నాడని, వయసు 55 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. మహారాణిపేట సీఐ, ఎస్.ఐ నెంబర్లు 94407 96010, 94407 96052కు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News September 11, 2024

తెరుచుకున్న బొర్రా గుహలు

image

భారీ వర్షాల వల్ల అల్లూరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసివేసిన బొర్రా గుహలను అధికారులు మంగళవారం తెరిచారు. అయితే మంగళవారం కేవలం 300 మంది పర్యాటకులు మాత్రమే బొర్రా గుహలను సందర్శించారని యూనిట్ మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు.

News September 11, 2024

విశాఖ-అరకులోయ బస్సుల పునరుద్ధరణ

image

భారీ వర్షాల కారణంగా విశాఖ నుంచి అరకులోయ రాకపోకలు సాగించే మూడు బస్సులను గత శనివారం నుంచి నాలుగు రోజుల పాటు రద్దు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో బుధవారం నుంచి ఈ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. విశాఖపట్నం నుంచి మాడుగుల, పాడేరు వెళ్లాల్సిన సర్వీసులను చోడవరం వరకు మాత్రమే నడుపుతున్నారు. భారీ వర్షాల కారణంగా చోడవరం నుంచి మాడుగుల, పాడేరు రూట్లు బాగా పాడయ్యాయి.

News September 11, 2024

విశాఖలో రికార్డు ధర పలికిన వినాయకుడి లడ్డూ

image

సీతమ్మధార రైతు బజార్ సమీపంలో గల ఆక్సిజన్ టవర్స్ వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి వినాయకుని ప్రసాదమైన 50 కిలోల లడ్డూ వేలంపాటలో రూ.4.50 లక్షలు పలికింది. స్థానికురాలు హర్ష పల్లవి లడ్డూను వేలంలో దక్కించుకుని.. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆక్సిజన్ టవర్స్ నివాసితుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.