News September 24, 2024

R.కృష్ణయ్య రాజీనామా

image

రాజ్యసభ సభ్యత్వానికి R.కృష్ణయ్య రాజీనామా చేశారు. దీనికి రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం తెలిపారు. ఏపీ నుంచి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే రాజీనామా చేశానని కృష్ణయ్య వెల్లడించారు. తెలంగాణకు చెందిన R.కృష్ణయ్యను గతంలో వైఎస్ జగన్ ఏపీ నుంచి రాజ్యసభకు పంపారు.

Similar News

News January 14, 2026

గంజితో ఎన్నో లాభాలు

image

అన్నం వండిన తర్వాత వచ్చే గంజి తాగడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గంజిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సాయపడతాయంటున్నారు నిపుణులు. గంజిని ఒక మెత్తని వస్త్రం లేదా దూదితో ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన పదినిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.

News January 14, 2026

ముగ్గుల్లో వైద్య, కంప్యూటర్ శాస్త్రాల మేళవింపు

image

ముగ్గులలో వైద్యశాస్త్ర సంకేతాలు ఉన్నాయట. కిందికి, పైకి ఉండే త్రిభుజాలు స్త్రీ, పురుష తత్వాలను సూచిస్తాయట. వీటి కలయికతో ఏర్పడే 6 కోణాల నక్షత్రం సృష్టికి సంకేతం. ఆధునిక కాలంలో కంప్యూటర్ ఆల్గారిథమ్స్ రూపొందించడానికి, క్లిష్టమైన ప్రోటీన్ నిర్మాణాలను అర్థం చేసుకోవడానికి కూడా ముగ్గులు తోడ్పడుతున్నాయట. గణితం, మానవ శాస్త్రం కలగలిసిన అద్భుత కళాఖండం ఈ రంగవల్లిక. ఇది మన సంస్కృతిలోని విజ్ఞానానికి నిదర్శనం.

News January 14, 2026

అరటి పంట పెరుగుదల, పండు నాణ్యత కోసం..

image

అరటి మొక్కకు కొద్దిపాటి రసాయన ఎరువులతో పాటు ఎక్కువ మొత్తంలో సేంద్రియ ఎరువులను వేయడం వల్ల మొక్క ఎదుగుదలతో పాటు పండు నాణ్యత పెరుగుతుంది. 300 గ్రాముల భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 5 కేజీల బాగా చివికిన పశువుల ఎరువుతో కలిపి మొక్కలకు అందించాలి. 45 సెం.మీ పొడవు, వెడల్పు, లోతుతో గుంతలు తీసి అందులో ఈ ఎరువును వెయ్యాలి. భాస్వరం ఎరువులు పంట మొదటి దశలోనే అవసరం. తర్వాతి దశలో అవసరం ఉండదు.