News February 23, 2025

రామాయణ రణ రంగంలోకి ‘రావణ్’

image

నితేశ్ తివారీ డైరెక్షన్‌లో ‘రామాయణ’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రావణుడి పాత్రలో కనిపించనున్న యశ్ కొన్ని రోజులుగా ముంబైలో జరుగుతున్న చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు సమాచారం. యుద్ధ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తొలి భాగం 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News January 31, 2026

అంబటి వ్యాఖ్యలను జగన్ సమర్థిస్తున్నారా: సత్యకుమార్

image

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో నేడు చేసిన వ్యాఖ్యలు YSRCP నైజానికి అద్దం పడుతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ‘సీఎంని దుర్భాషలాడడం అత్యంత హేయం. జుగుప్సాకరం. అంబటి వ్యాఖ్యలను జగన్‌ సమర్థిస్తున్నారా? ఆ వ్యాఖ్యలపై జగన్‌ తక్షణం స్పందించాలి’ అని డిమాండ్ చేశారు. అంబటి వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలు, కార్యకర్తల వికృత నైజం, అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు.

News January 31, 2026

ఒక్క రోజే రూ.85,000 తగ్గిన సిల్వర్ రేటు

image

బులియన్ మార్కెట్‌లో వెండి ధరల పతనం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం కేజీ వెండి రేటు <<19009714>>రూ.55వేలు తగ్గగా<<>>, గంటల వ్యవధిలోనే మరో రూ.30వేలు పడిపోయింది. దీంతో ఒక్కరోజులోనే సిల్వర్ రేటు రూ.85వేలు తగ్గి రూ.3,20,000కు చేరింది.

News January 31, 2026

యజమానుల సమక్షంలోనే భూముల రీసర్వే

image

AP: భూముల రీసర్వేలో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దేలా కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ‘ప్రస్తుతం కొత్తగా చేపట్టే సర్వేలో భూయజమానిని తప్పనిసరిగా భాగస్వామిని చేయాలి. ఒకవేళ అందుబాటులో లేకుంటే ఆయన వచ్చాకనే రీసర్వే చేయాలి. భూ రికార్డు వివరాలను యజమానులకు చూపించి ఓకే అంటేనే పాస్ పుస్తకాల ముద్రణకు పంపాలి. ప్రతినెల 2-9 తేదీల మధ్య పాస్‌ పుస్తకాలు అందించాలి’ అని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది.