News October 21, 2024
రబాడ@300

దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడ అరుదైన క్లబ్లో చేరారు. SA తరఫున టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఆరో ప్లేయర్గా నిలిచారు. బంగ్లాదేశ్తో మ్యాచులో ఈ ఘనత సాధించారు. 65 టెస్టుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. ఈ జాబితాలో స్టెయిన్(439), పొలాక్(421), ఎన్తిని(390), డొనాల్డ్(330), మోర్కెల్(309) రబాడ కన్నా ముందు ఉన్నారు. ఓవరాల్గా ఈ జాబితాలో మురళీధరన్(800) తొలి స్థానంలో ఉన్నారు.
Similar News
News November 26, 2025
మంచిర్యాల: నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయితీ ఎన్నికల నిర్వహణలో నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కార్యాలయంలో శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, ఫలితాలు వంటి ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
News November 26, 2025
‘పిశాచి 2’లో న్యూడ్ సీన్స్.. స్పందించిన హీరోయిన్

తాను నటించిన ‘పిశాచి 2’లో న్యూడ్ సీన్స్ ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై తమిళ నటి ఆండ్రియా జెరేమియా స్పందించారు. సినిమాలో బోల్డ్ సీన్లు చాలానే ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డైరెక్టర్ అడిగితే పాత్ర కోసం ఏదైనా చేస్తానని ఆమె చెప్పారు. ఆండ్రియా పిశాచి, సైంధవ్, తడాఖా వంటి సినిమాల్లో నటించారు. పిశాచి-2 విజయ్ సేతుపతి, ఆండ్రియా లీడ్ రోల్లో తెరకెక్కింది. కోర్టు కేసు కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది.
News November 26, 2025
ఫ్యాన్సీ క్రేజ్.. 8888 నంబర్కు భారీ ధర!

కార్ల ఫ్యాన్సీ నంబర్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందుకోసం కొందరు లక్షల్లో ఖర్చు పెడుతుంటారు. కానీ హరియాణాలో ఓ వ్యక్తి ఏకంగా HR88B8888 నంబర్ ప్లేట్ కోసం ఏకంగా ₹కోటి పైనే వెచ్చించాడు. ఈ నంబర్ కోసం నిర్వహించిన వేలంలో 45 అప్లికేషన్లు వచ్చాయి. బిడ్డింగ్ ధర ₹50 వేలుగా నిర్ణయించగా రికార్డు స్థాయిలో ₹1.17 కోట్లు పలికింది. దేశంలో అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్గా నిలిచింది.


