News December 9, 2024

రబీ: 4.28 కోట్ల హెక్టార్లలో సాగు

image

దేశవ్యాప్తంగా రబీ సీజన్‌లో పంటల సాగు గణనీయంగా పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఏడాది 4.11 కోట్ల హెక్టార్లలో సాగవగా, ఈ ఏడాది డిసెంబర్ తొలి వారానికే 4.28 కోట్ల హెక్టార్లకు చేరుకుందని తెలిపింది. గోధుమలు 2 కోట్ల హెక్టార్లు, పప్పు ధాన్యాలు 1.08 కోట్ల హెక్టార్లు, వరి 97.5 లక్షల హెక్టార్లలో సాగైనట్లు పేర్కొంది.

Similar News

News January 23, 2026

‘₹40 లక్షలు మోసం చేశాడు’.. మంధాన మాజీ ప్రియుడిపై ఫిర్యాదు

image

భారత క్రికెటర్ స్మృతి మంధాన మాజీ ప్రియుడు పలాశ్ ముచ్చల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ₹40 లక్షలు మోసం చేశారని సాంగ్లి(MH)లో విజ్ఞాన్ మానే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నజరియా అనే మూవీలో ఇన్వెస్ట్ చేయాలని, నటించే ఛాన్స్ ఇస్తానని పలాశ్ చెప్పాడు. అతడికి ₹40 లక్షలు ఇచ్చా. ప్రాజెక్టు పూర్తి కాలేదు. డబ్బు ఇవ్వమంటే పట్టించుకోలేదు’ అని పేర్కొన్నారు. అటు FIR నమోదు కాలేదని పోలీసులు చెప్పారు.

News January 23, 2026

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (<>HCL<<>>)2 హిందీ ట్రాన్స్‌లేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ( హిందీ, ఇంగ్లిష్) అర్హత గల వారు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.hindustancopper.com

News January 23, 2026

ట్రంప్ కంటే మోదీ పవర్‌ఫుల్: ఇయాన్ బ్రెమ్మర్

image

US అధ్యక్షుడు ట్రంప్ కంటే మన PM మోదీయే చాలా పవర్‌ఫుల్ అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమ్మర్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ పదవి మరో మూడేళ్లలో పోతుందని.. కానీ మోదీకి దేశంలో తిరుగులేని మద్దతు ఉందని పేర్కొన్నారు. దీంతో మోదీ సంస్కరణలను దూకుడుగా అమలు చేయగలరని, విదేశీ ఒత్తిడి వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలరని విశ్లేషించారు. ట్రంప్ కంటే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా బెటర్ పొజిషన్‌లో ఉన్నట్లు తెలిపారు.