News October 22, 2025

రబీ సాగు- నేలను బట్టి ఈ పంటలతో లాభాలు

image

రబీలో నేల స్వభావం, నీటి తడులను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల రైతులు అధిక దిగుబడి సాధించి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. నీటి సౌకర్యం ఉన్న ఎర్ర, నల్లరేగడి నేలల్లో వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, కంది, పెసర, మినుము, అలసంద, కుసుమ, నువ్వులు సాగు చేయవచ్చు. వర్షాధార ఎర్ర నేలల్లో ఉలవలు, జొన్నలు.. వర్షాధార నల్ల రేగడి నేలల్లో శనగ, కుసుమ, ఆవాలు సాగు చేయవచ్చు.

Similar News

News February 8, 2026

జైపూర్‌లోని ESIC హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

జైపూర్‌లోని <>ESIC<<>> హాస్పిటల్ 43 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల వారు ఫిబ్రవరి 25న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS+PG/DNB/డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.225. SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

News February 8, 2026

JEE మెయిన్ ‘కీ’లో 17 తప్పులు? బోనస్ మార్కుల కోసం డిమాండ్

image

JEE మెయిన్ 2026 సెషన్-1 ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లో 17 తప్పులున్నాయని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. ఫిజిక్స్‌లో ఎక్కువ పొరపాట్లు దొర్లాయని, వీటి వల్ల విద్యార్థుల ర్యాంకులు తలకిందులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుగా ఉన్న 10 ప్రశ్నలకు బోనస్ మార్కులు ఇవ్వాలని, మిగిలిన 7 ప్రశ్నల సాంకేతిక లోపాలను సరిదిద్దాలని NTAను డిమాండ్ చేసింది. Feb 12న తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

News February 8, 2026

బంగ్లా హిందువులకు మద్దతు లభిస్తుంది: RSS

image

బంగ్లాదేశ్‌లో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై RSS చీఫ్ మోహన్ భాగవత్ శతాబ్ది ఉత్సవాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బంగ్లాలో దాదాపు రూ.1.25 కోట్లమంది హిందువులు ఉన్నారు. వారి హక్కుల కోసం పోరాడాలి అనుకుంటే ప్రపంచంలోని హిందువులంతా వారికి మద్దతుగా నిలుస్తారు’ అని తెలిపారు. అలాగే ‘RSS చీఫ్ పదవికి విరమణ అనేది ఉండదు. ఇప్పటివరకు అలాంటి పరిస్థితి కూడా రాలేదు. అయితే దిగమంటే దిగిపోతాను’ అని స్పష్టం చేశారు.