News March 23, 2024
ఒకే ఫ్రేమ్‌లో రవీంద్ర స్క్వేర్

రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఇరువురూ ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం ఫొటోకు పోజులిచ్చారు. నిన్నటి మ్యాచ్‌లో ఈ ఇద్దరు ప్లేయర్లు సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించారు. 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసిన రచిన్ చెన్నై టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 25* రన్స్‌తో జడేజా జట్టును విజయతీరాలకు చేర్చారు.
Similar News
News December 8, 2025
వెబ్సైట్లో కోటి ఎకరాల నిషేధిత భూముల జాబితా

TG: 22A జాబితాలోని నిషేధిత భూముల వివరాలు అందుబాటులోకి వచ్చాయి. స్టాంప్స్&రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో వీటిని అప్లోడ్ చేసింది. GOVT, ఎండోమెంటు, అటవీ, ఇరిగేషన్, పేదలకు కేటాయించిన 77 లక్షల ACERS ఈ జాబితాలో ఉన్నాయి. మరో 20L ఎకరాలకు పైగా పట్టాదారుల భూమి ఉంది. ముందుగా వీటిని పరిశీలించి భూములు కొనుగోలు చేయొచ్చు. కాగా RR, MDK, సంగారెడ్డి(D)లలో కొన్ని ఖరీదైన భూములను న్యాయ వివాదాలతో జాబితాలో చేర్చలేదు.
News December 8, 2025
ఐఏఎస్ ఆమ్రపాలికి హైకోర్టులో చుక్కెదురు

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ జూన్‌లో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలిని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. కాగా ప్రస్తుతం ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి పని చేస్తున్నారు.
News December 8, 2025
‘బతికుండగానే తండ్రికి విగ్రహం’.. కేటీఆర్‌పై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ AI ఫొటోను కేటీఆర్ పోస్టు చేయడంపై కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘బతికి ఉండగానే తండ్రికి విగ్రహం పెట్టిన కేటీఆర్.. సీఎం పదవి కోసం కేసీఆర్‌ను కడతేర్చాలని డిసైడ్ అయినట్టున్నాడు’ అంటూ రాసుకొచ్చింది. కాగా ‘కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా?’ అనే ఉద్దేశంలో కేటీఆర్ పోస్ట్ చేశారని అటు బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు.


