News July 6, 2024
బ్రిటన్ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్

బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాచెల్ రీవ్స్ను తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నియమిస్తున్నట్లు నూతన PM స్టార్మర్ తెలిపారు. 45 ఏళ్ల రీవ్స్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్లో ఎకానమిస్ట్గా పనిచేశారు. 2010లో ఆమె తొలిసారి లేబర్ పార్టీ నుంచి MPగా ఎన్నికయ్యారు. ఆర్థిక వృద్ధే లేబర్ పార్టీ ప్రధాన మిషన్ అని ఆమె పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన స్టార్మర్కు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News January 23, 2026
పిల్లలు ఎత్తు పెరగట్లేదా?

కొంతమంది పిల్లలు వయస్సుకు తగ్గట్లు ఎత్తు పెరగరు. ఇలా కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని ఇవ్వాలంటున్నారు నిపుణులు. క్యారెట్, బీన్స్, బచ్చలికూర, బఠాణీ, అరటి, సోయాబీన్, పాలు, గుడ్లు డైట్లో చేర్చాలి. వీటిలో ఉండే కాల్షియం, మినరల్స్ పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడతాయి. అలాగే రోజూ వ్యాయామం, సైక్లింగ్ చేయిస్తే గ్రోత్ హార్మోన్స్ పెరగడానికి దోహదం చేస్తాయి.
News January 23, 2026
TTD ట్రస్టులకు రూ.2.50 కోట్ల విరాళం

AP: TTDలోని పలు ట్రస్టులకు హైదరాబాద్కు చెందిన పీఎల్ రాజు కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ రూ.2.50కోట్ల భారీ విరాళాన్ని శుక్రవారం అందించింది. శ్రీవేంకటేశ్వర ప్రాణ, విద్యాదాన ట్రస్టులకు చెరో రూ.75లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.50లక్షలు, అన్నప్రసాదం, గోసంరక్షణ ట్రస్టులకు చెరో రూ.25లక్షల విలువైన డీడీలను TTD అదనపు EOకు సంస్థ అధినేత అందజేశారు.
News January 23, 2026
పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలంటే?

మగపిల్లలకు 3, 5, 7, 9, 11వ నెలలో లేదా 3వ ఏట, ఆడపిల్లలకు 4, 6, 8, 10, 12వ నెలలో లేదా సరి సంవత్సరాల్లో ఈ కార్యం చేయాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. సోమ, బుధ, గురు, శుక్రవారాలు పుట్టు వెంట్రుకలు తీయడానికి అత్యంత శ్రేష్ఠమైనవని చెబుతున్నారు. ఆది, మంగళ, శనివారాలను నివారించాలని శాస్త్రం చెబుతోంది. వీలైనంత వరకు ఉదయం పూట, ముఖ్యంగా ‘సింహ లగ్నం’ లేదా ఇతర శుభ లగ్నాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం మంచిది.


