News December 19, 2024
రేసింగ్ స్కాం.. ఆరోపణలేంటి.. క్లుప్తంగా

>క్యాబినెట్, ఆర్థిక శాఖల అనుమతి లేకుండా ₹45 కోట్లు విదేశీ సంస్థకు చెల్లించాలని ఆదేశించి ప్రజాధనం దుర్వినియోగం చేశారనేది KTRపై ఆరోపణ
>మౌఖిక ఆదేశాలతో, RBI రూల్స్ ఫాలో కాకుండా నగదు బదిలీతో ₹8 కోట్లు ఫైన్‌గా అదనంగా నష్టం చేకూర్చారనేది IAS అర్వింద్, KTRలపై ఆరోపణ
>₹10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపునకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనుమతి ఉండాలన్న రూల్ బుక్‌ను HMDA ఫాలో కాలేదు- చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిపై అభియోగం
Similar News
News November 7, 2025
రోడ్ల స్థితిగతులపై కొత్త సిస్టమ్: పవన్ కళ్యాణ్

AP: పల్లె రోడ్ల స్థితిగతులు ప్రజలకు ముందుగా తెలిసేలా ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ను తీసుకురానున్నట్టు Dy CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ₹2,123 కోట్ల సాస్కీ నిధులతో పల్లెపండగ 2.0లో 4007 KM రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించాలని చెప్పారు. నిర్మాణాలు నాణ్యతతో ఉండాలన్నారు. స్వమిత్వ పథకం ద్వారా గ్రామాల్లో MARకి కోటి మంది ఆస్తులకు యాజమాన్య హక్కు (ప్రాపర్టీ) కార్డులు అందించాలని సూచించారు.
News November 7, 2025
రైనా, ధవన్.. వీళ్లేం సెలబ్రిటీలు?: సజ్జనార్

TG: బెట్టింగ్ యాప్‌లకు <<18217144>>ప్రమోషన్<<>> చేసిన మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌పై HYD సీపీ సజ్జనార్ ఫైరయ్యారు. ‘అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ బారిన పడి ఎంతో మంది యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా? వీళ్లేం సెలబ్రిటీలు?’ అని ట్వీట్ చేశారు.
News November 7, 2025
వంటింటి చిట్కాలు

* కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది.
* పెరుగుపచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.
* కట్ చేసిన బెండకాయల మీద నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలమీద జిగురు ఉండదు.
* వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది.


