News April 10, 2024

రాధాకిషన్ రావుకు రిమాండ్ పొడిగింపు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 12 వరకు ఆయనకు ఈ రిమాండ్ విధిస్తున్నట్లు నాంపల్లి కోర్టు తెలిపింది. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు.

Similar News

News January 7, 2026

లండన్ vs బెంగళూరు లైఫ్.. గూగుల్ ఇంజినీర్ పోస్ట్ వైరల్!

image

లండన్‌లో ₹1.3 కోట్ల జీతం కంటే బెంగళూరులో ₹45 లక్షలతోనే లైఫ్ బిందాస్‌గా ఉందని గూగుల్ ఇంజినీర్ వైభవ్ అగర్వాల్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. లండన్‌లో అద్దెలు, పన్నులు పోనూ ఏమీ మిగలదని, పనులన్నీ మనమే చేసుకోవాలని పేర్కొన్నారు. అదే బెంగళూరులో పనిమనుషులు, తక్కువ ఖర్చుతో లగ్జరీ లైఫ్ అనుభవించ వచ్చని లెక్కలతో వివరించారు. క్వాలిటీ లైఫ్‌స్టైల్ కోసం లండన్, లగ్జరీ, కంఫర్ట్ కోసం బెంగళూరు బెటర్ అని తేల్చారు.

News January 7, 2026

ఫోన్ ట్యాపింగ్.. మరో ఇద్దరికి సిట్ నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌రావు తండ్రి కొండల్‌రావుకు సిట్ నోటీసులు జారీచేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు రావాలని ఆదేశించింది. కాగా ఇటీవల నవీన్‌రావు కూడా విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

News January 7, 2026

పండుగకి ఊరెళ్తున్నారా?

image

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇల్లు విడిచి వెళ్లేముందు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించడం శ్రేయస్కరం. ఇంటికి రెండు ద్వారాలు ఉంటే రహదారికి కనిపించే తలుపుకు లోపల, మరో వైపున్న తలుపుకు బయటివైపు తాళం వేయాలి. ఆ తాళం బయటకు కనిపించకుండా కర్టైన్స్ వేయడం మంచిది. ముఖ్యంగా ఇంట్లో బంగారం, నగదు వదిలి వెళ్లవద్దని కోరుతున్నారు.