News June 7, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్కు బెయిల్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. తన తల్లి పెద్ద ఖర్మ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 10 నుంచి 14 వరకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. BRS హయాంలో టాస్క్ఫోర్స్ మాజీ DCP ప్రభాకర్ అధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారవేత్తలు, హవాలా వ్యాపారం చేసే వ్యక్తుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టిన కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
Similar News
News December 13, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 13, 2025
వెనిజుల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం!

వెనిజుల-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. వెనిజుల తీరం వెంబడి USకు చెందిన F/A-18 జెట్లు దాదాపు 40 నిమిషాల పాటు తిరిగాయి. అదే విధంగా బాంబర్లు, ఫైటర్ జెట్లు, లాంగ్ రేంజ్ డ్రోన్లు చక్కర్లుకొడుతుండటం ఉద్రిక్తతలకు దారితీసింది. తీరానికి 20 మైళ్ల దూరం వరకు ఇవి వచ్చినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ అక్రమ రవాణా విషయంలో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఆ దేశంపై <<18453636>>దాడి<<>> చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
News December 13, 2025
SBIలోనూ వడ్డీ రేట్లు తగ్గాయ్

<<18500647>>RBI<<>> రెపో రేటును 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో SBI కూడా రుణ రేట్లను సవరించింది. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ రేటు(EBLR)ను 7.90 శాతానికి కుదించింది. MCLRను 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 8.70 శాతానికి చేరింది. అలాగే 2-3 ఏళ్ల వ్యవధి FD రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40 శాతానికి, 444 రోజుల కాలవ్యవధి రేటును 6.45 శాతానికి పరిమితం చేసింది. ఈ రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయంది.


