News September 13, 2024

కోహ్లీతో రాధికా శరత్‌కుమార్ సెల్ఫీ

image

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. అదే విమానంలో ప్రయాణించిన ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ ఆయనతో సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘కోట్లాది మనసులను గెలుచుకున్న వ్యక్తి కోహ్లీ. ఆట పట్ల నిబద్ధతతో ఆయన మనల్ని గర్వపడేలా చేస్తారు. విరాట్‌తో కలిసి ప్రయాణించడం ఆనందంగా ఉంది. సెల్ఫీ ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.

Similar News

News November 14, 2025

పిల్లల్లో ADHDకి మందులు వాడుతున్నారా?

image

కొందరు పిల్లల్లో అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివ్‌ డిసీజ్‌ వస్తుంటుంది. అయితే కొందరు వైద్యులు వ్యాధి నిర్ధారణ అవ్వగానే మందులు ఇస్తారు. కానీ ఇది సరికాదంటోంది స్టాన్‌ఫర్డ్‌ మెడిసిన్‌ తాజా అధ్యయనం. ఆరేళ్లలోపు పిల్లల్లో మందులను ప్రాసెస్‌ చేసే మెటబాలిజం పూర్తిగా అభివృద్ధి చెందదు. కాబట్టి మందుల వల్ల ఎలాంటి ప్రయోజనమూ దక్కదు. దానికంటే ముందు వాళ్లకు బిహేవియరల్‌ థెరపీ ఇవ్వాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

News November 14, 2025

రెండో రౌండ్‌లోనూ సేమ్ సీన్

image

జూబ్లీహిల్స్ బైపోల్ రెండో రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులోనూ నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్‌లో నవీన్‌కు 9,691, మాగంటి సునీతకు 8,690 ఓట్లు పోలయ్యాయి. రెండు రౌండ్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్థి 1,144 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్‌లో వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

News November 14, 2025

14,967 పోస్టులకు నోటిఫికేషన్

image

KVS, NVSలో 14,967 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో 13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, ME, M.Tech, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. నేటి నుంచి DEC 4వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: kvsangathan.nic.in/మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.