News April 24, 2024
కువైట్‌లో తొలిసారి హిందీలో రేడియో ప్రసారాలు

కువైట్‌లో తొలిసారి హిందీలో రేడియో ప్రసారాలు ప్రారంభించినట్లు అక్కడి ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. ప్రతి ఆదివారం రాత్రి 8.30 నుంచి 9 వరకు FM 93.3, 96.3 ఫ్రీక్వెన్సీల్లో ప్రోగ్రామ్స్ ప్రసారమవుతాయని తెలిపింది. దీనివల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని పేర్కొంది. కాగా ప్రస్తుతం కువైట్‌లో దాదాపు 10 లక్షల మంది ఇండియన్స్ నివసిస్తున్నారు.
Similar News
News March 27, 2026
మేమూ యుద్ధంలోకి దిగుతాం: ఉగాండా

ఒకవేళ ఇజ్రాయెల్ ఓటమి అంచున ఉంటే తాము యుద్ధంలోకి దిగుతామని ఉగాండా సైన్యాధ్యక్షుడు జనరల్ ముహూజీ ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఇరాన్‌పై దాడికి తమ బ్రిగేడ్ సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్ తమపై మిస్సైల్స్‌తో దాడి చేస్తే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. 1980, 1990ల్లో తమ దేశం ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ తమకు అండగా నిలిచిందని ముహూజీ గుర్తు చేసుకున్నారు.
News March 27, 2026
ఏప్రిల్ 2న పార్లమెంటులో అమరావతి బిల్లుకు ఛాన్స్: చంద్రబాబు

AP: రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై రేపు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తే ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ ముందుకు వెళ్తుందన్నారు. కుదిరితే ఏప్రిల్ 2నే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా అమరావతిపై జగన్ కుట్రలను ప్రజలకు తెలియజేయాలని మంత్రులకు సూచించారు.
News March 27, 2026
వీటి శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వద్దు

మేకప్ బ్రష్‌లు, స్పాంజ్‌లకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. కానీ వాటిని ఏడాదికి ఒకసారైనా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. మేకప్ టూల్స్‌ను దీర్ఘకాలంపాటు మార్చకుండా ఉంటే వాటి నాణ్యతపై ప్రభావం పడుతుంది. అలాగే వీటిని రెగ్యులర్‌గా క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు తలెత్తుతాయి. వేడి నీళ్లు, డిష్ వాషర్ సోప్, యాంటి బ్యాక్టీరియల్ సోప్, బేబీషాంపూతో వాటిని శుభ్రం చేసుకోవచ్చు.


